logo

గ్రామాల్లో భాజపా ఎన్నికల ప్రచారం

భాజపా ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌కు మద్దతుగా నాగిరెడ్డి మండలంలోని బొల్లారం, మెలకుంట తండా, ఆత్మకూరు, గ్రామలలో భాజాపా నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

Published : 08 May 2024 15:47 IST

రామారెడ్డి: భాజపా ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌కు మద్దతుగా నాగిరెడ్డి మండలంలోని బొల్లారం, మెలకుంట తండా, ఆత్మకూరు, గ్రామలలో భాజాపా నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ కూలీలను కలిసి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని మండల అధ్యక్షుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలలో నరేంద్ర మోదీ పేద ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను పథకాలను తీసుకురావడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాజమోహన్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు శెట్టిగారి అంజయ్య, ప్రధాన కార్యదర్శి  శ్రీనివాస్, శేఖర్, రాజి రెడ్డి, నరేందర్ రెడ్డి, దేవిసింగ్, సదానంద రెడ్డి, వెంకట్రాంరెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని