logo

Anaconda: తొమ్మిది పిల్లలకు జన్మనిచ్చిన అనకొండ

భువనేశ్వర్‌లోని నందన్‌కానన్‌ జంతు ప్రదర్శనశాలలో ఉన్న అనకొండ 9 పిల్లలకు జన్మనిచ్చింది. రాష్ట్రంలో అనకొండకు పిల్లలు జన్మించడం ఇదే తొలిసారి. నందన్‌కానన్‌ అధికారులు తెలిపిన ప్రకారం.. 2019లో చెన్నైలోని మొసళ్ల పార్కు

Updated : 10 Jul 2022 08:46 IST

భువనేశ్వర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: భువనేశ్వర్‌లోని నందన్‌కానన్‌ జంతు ప్రదర్శనశాలలో ఉన్న అనకొండ 9 పిల్లలకు జన్మనిచ్చింది. రాష్ట్రంలో అనకొండకు పిల్లలు జన్మించడం ఇదే తొలిసారి. నందన్‌కానన్‌ అధికారులు తెలిపిన ప్రకారం.. 2019లో చెన్నైలోని మొసళ్ల పార్కు నుంచి 8 పసుపు రంగు అనకొండలను నందన్‌కానన్‌ జూకు తీసుకొచ్చారు. అనంతరం ఒడిశా యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ టెక్నాలజీ సంస్థ (ఓయూఏటీ), జూ అధికారులు కలిసి అనకొండల సంతతి పెంచేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తాజాగా ఆ ప్రయత్నం ఫలించిందని తెలిపారు. గురువారం అనకొండ ఓ పిల్లకు జన్మనిచ్చింది. అనంతరం అనారోగ్యానికి గురైంది. కడుపు పొంగిపోవడంతో వైద్యులు, ఓయూఏటీ నిపుణులు చికిత్స ప్రారంభించారు. పాము పొట్టలో పిల్లలు ఉన్నట్లు గుర్తించి అవి సురక్షితంగా బయటకు వచ్చేందుకు చర్యలు ప్రారంభించారు. శుక్రవారం 9 పిల్లలు జన్మించగా వాటిలో ఒకటి మృతి చెందిందని అధికారులు తెలిపారు. చెన్నై నుంచి తీసుకొచ్చిన వాటిలో మూడు మృతి చెందాయని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని