logo

వన్య ప్రాణుల దాడిలో 425 మంది మృతి

గడిచిన మూడేళ్లలో (2019-2022) మధ్య వన్యప్రాణుల దాడిలో 425 మంది మృతి చెందినట్లు అటవీ, పర్యావరణశాఖల మంత్రి ప్రదీప్‌ అమత్‌ చెప్పారు.

Published : 03 Dec 2022 00:54 IST

మూడేళ్లలో 245 ఏనుగుల మృత్యువాత

ప్రదీప్‌ అమత్‌

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: గడిచిన మూడేళ్లలో (2019-2022) మధ్య వన్యప్రాణుల దాడిలో 425 మంది మృతి చెందినట్లు అటవీ, పర్యావరణశాఖల మంత్రి ప్రదీప్‌ అమత్‌ చెప్పారు. శాసనసభలో శుక్రవారం బిజద సభ్యుడు అనంతదాస్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. వీటి దాడుల్లో మరో 1,013 మంది గాయపడ్డారన్నారు. ఈ మూడేళ్లలో రాష్ట్రంలో పులులు మృతి చెందలేదని, 245 ఏనుగులు, 1,347 ఇతర వన్యప్రాణులు వేర్వేరు కారణాలతో మృత్యువాత పడినట్లు తెలిపారు. గజరాజుల మృతికి ఆయాచోట్ల వేలాడుతున్న విద్యుత్తు తీగలు ప్రధాన కారణమని పేర్కొన్నారు. జనావాసాలవైపు గజరాజులు రాకుండా అటవీ ప్రాంతాల్లో ఎలిఫెంట్‌ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని