logo

ఆంధ్రా వైద్య బృందానికి కొఠియాలో చేదు అనుభవం

కొఠియా గ్రామాల్లో పర్యటించిన సమయంలో ఆంధ్రాకు చెందిన అధికారులను ఒడిశా అధికారులు అడ్డుకున్న ఘటనలు చాలా ఉన్నాయి. తాజాగా అలాంటి సంఘటన వైద్యులకు ఎదురైంది.

Published : 04 Dec 2022 02:19 IST

ఆంధ్ర వైద్య సిబ్బందిని ఆపిన సమితి అధికారులు

సిమిలిగుడ, న్యూస్‌టుడే: కొఠియా గ్రామాల్లో పర్యటించిన సమయంలో ఆంధ్రాకు చెందిన అధికారులను ఒడిశా అధికారులు అడ్డుకున్న ఘటనలు చాలా ఉన్నాయి. తాజాగా అలాంటి సంఘటన వైద్యులకు ఎదురైంది. శుక్రవారం ఆంధ్రాలోని సాలూరు పరిధిలోని తోనాం పీహెచ్‌సీకి చెందిన వైద్యులు డాక్టర్‌ అజయ్‌ తన సిబ్బందితో గంజాయి పొదొరొకు వెళ్లగా అక్కడ ఉన్న ఒడిశా కానిస్టేబుల్‌ ఈ విషయాన్ని కొఠియా ఠాణా అధికారి కపిలేశ్వర్‌ బెహర దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కానిస్టేబుల్‌ సాయంతో వైద్యులు అజయ్‌తో ఫోన్‌లో మాట్లాడిన బెహర వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని, వైద్య శిబిరం నిర్వహించేందుకు అనుమతి లేదని హెచ్చరించారు. దాంతో డాక్టర్‌ అజయ్‌, తన సిబ్బందితో సంచార వాహనంలో వెనుతిరిగారు. కొంత దూరం వెళ్లాక పొట్టంగి సమితి అధికారి సౌమ్య సారథి మిశ్ర, పోలీసులు మరోసారి వైద్యబృందంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒడిశా ప్రభుత్వం, కొరాపుట్‌ జిల్లా యంత్రాంగం ఇక్కడి ప్రజలకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాయని, కొఠియాలో అడుగు పెట్టాలంటే పొట్టంగి సమితి అనుమతితో ప్రవేశించాలని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని