logo

శ్రీక్షేత్రంలో రథాల కలపకు పూజ

‘పూరీ జగన్నాథుని రథయాత్ర-2023’కి తెరలేచింది. మాఘ శుక్ల(వసంత) పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం సాయంత్రం శ్రీక్షేత్ర కార్యాలయం ఆవరణలో నందిఘోష్‌ (జగన్నాథుడు), తాళధ్వజ.

Published : 27 Jan 2023 01:49 IST

పద్మావతారంలోని జగన్నాథుడ్ని దర్శించుకున్న భక్తులు

శ్రీక్షేత్రం కార్యాలయం ఆవరణలో కలప పూజలు చేస్తున్న సేవాయత్‌లు

గోపాల్‌పూర్‌, న్యూస్‌టుడే: ‘పూరీ జగన్నాథుని రథయాత్ర-2023’కి తెరలేచింది. మాఘ శుక్ల(వసంత) పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం సాయంత్రం శ్రీక్షేత్ర కార్యాలయం ఆవరణలో నందిఘోష్‌ (జగన్నాథుడు), తాళధ్వజ (బలభద్రుడు), దర్పదళన్‌ (సుభద్ర) రథాల తయారీ పనులకు సంబంధించి మూడు కలప దుంగలకు పూజలు చేశారు. శ్రీక్షేత్ర ప్రధాన సేవాయత్‌ పట్టజోషి మహాపాత్ర్‌ ఆధ్వర్యంలో గర్భగుడిలో ముగ్గురు మూర్తుల సన్నిధిలో పూజలు నిర్వహించిన సేవాయత్‌లు పురుషోత్తముని మెడలోని ఆజ్ఞమాల వెలుపలికి తీసుకొచ్చి కలప దుంగలపై ఉంచి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. శ్రీరామనవమి (మార్చి 30) నుంచి కలపకోత పనులు ప్రారంభమవుతాయి. అక్షయ తృతీయ (ఏప్రిల్‌ 23) నుంచి నిర్మాణాలు ముమ్మరమవుతాయి. వసంతపంచమిని పురస్కరించుకుని పురుషోత్తముని సన్నిధిలో ప్రత్యేక సేవలు నిర్వహించారు. బుధవారం అర్ధరాత్రి అరుదైన స్వామి పద్మావతార వేడుక జరగ్గా గురువారం భక్తులు స్వామి రూపాన్ని దర్శించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని