logo

దేశానికే మణిహారం జ్యోతిర్మయి

జగత్సింగ్‌పూర్‌ జిల్లా బలికుద సమితిలోని తితిరా గ్రామానికి చెందిన రసాయన శాస్త్రవేత్త జ్యోతిర్మయిపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు.

Published : 27 Mar 2023 01:58 IST

‘మన్‌కీబాత్‌’ లో ప్రధాని మోదీ ప్రశంస

జ్యోతిర్మయి మహంతి

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: జగత్సింగ్‌పూర్‌ జిల్లా బలికుద సమితిలోని తితిరా గ్రామానికి చెందిన రసాయన శాస్త్రవేత్త జ్యోతిర్మయిపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఆదివారం ‘మన్‌ కీ బాత్‌’లో ఆమె గురించి మాట్లాడారు. ముంబయిలో ‘బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌’లో శాస్త్రవేత్తగా పరిశోధనలు చేస్తున్న ఆమె ఫిబ్రవరిలో ప్రతిష్ఠాత్మకమైన ‘ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఆఫ్‌ ప్యూర్‌ అండ్‌ అప్లైడ్‌ కెమిస్ట్రీ-2023’ (ఐయూపీఏసీ) అవార్డు వరించింది. ఐయూపీఏసీ అవార్డు దక్కించుకున్న తొలి భారతీయ మహిళగా రికార్డులకెక్కిన జ్యోతిర్మయి దేశానికి మణిహారమని, ఎంతో మందికి ప్రేరణని కొనియాడారు. ఆమె భర్త రశ్మిరంజన్‌ మహంతి కూడా రసాయన శాస్త్రవేత్తే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని