logo

బిజదను వీడిన అగ్రనేత ప్రభాస్‌ సింగ్‌

బరగఢ్‌ మాజీ ఎంపీ, జిల్లా బిజద అధ్యక్షుడు ప్రభాస్‌ సింగ్‌ సోమవారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. స్వయంగా భువనేశ్వర్‌ వచ్చిన ఆయన నవీన్‌ నివాస్‌లో సీఎంను కలిసి రాజీనామా లేఖ అందజేశారు.

Published : 09 Apr 2024 04:22 IST

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: బరగఢ్‌ మాజీ ఎంపీ, జిల్లా బిజద అధ్యక్షుడు ప్రభాస్‌ సింగ్‌ సోమవారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. స్వయంగా భువనేశ్వర్‌ వచ్చిన ఆయన నవీన్‌ నివాస్‌లో సీఎంను కలిసి రాజీనామా లేఖ అందజేశారు.

విలువలకు సమాధి కట్టారు

2014 నుంచి 2019 వరకు బరగఢ్‌ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన ప్రభాస్‌కు గతసారి సీఎం టిక్కెట్లు కేటాయించలేదు. ప్రసన్న ఆచార్యను అభ్యర్థిగా చేశారు. ఆయన భాజపా నేత సురేష్‌ పూజారి చేతిలో ఓటమిపాలయ్యారు. ఈసారి తనకు అవకాశమిస్తారని ఆశలు పెంచుకున్న ప్రభాస్‌ను నవీన్‌ విస్మరించారు. భాజపా వీడి వచ్చిన పరిణీత మిశ్రను పోటీకి దింపారు. దీంతో అసంతృప్తికి గురై పార్టీకి రాజీనామా చేశారు. ప్రభాస్‌ విలేకరులతో మాట్లాడుతూ... బిజదలో ప్రస్తుతం విలువలు, ఆదర్శాలు లేవని, వాటికి సమాధి కట్టారన్నారు. బరగఢ్‌ జిల్లా బిజద అధ్యక్షునిగా అయిదేళ్లు చిత్తశుద్ధితో విధులు నిర్వహించిన తనతో సంప్రదించకుండా సీఎం అభ్యర్థిని ఖరారు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను రాజకీయ సన్యాసం తీసుకోలేదని, ఎన్నికల్లో పోటీచేసే అవకాశం లేకపోయినా ప్రజలతో మమేకమై ఉంటానన్నారు. సహచరులతో సంప్రదించిన తర్వాత కార్యాచరణ ఖరారు చేసుకుంటానన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని