logo

రహదారి నిర్మించకుంటే ఓటు వేయం

వర్షాకాలంలో గ్రామంలో అంబులెన్స్ రావడానికి దారి లేకపోవటంలో గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

Published : 06 May 2024 16:35 IST

నవరంగ్‌పూర్‌: వర్షాకాలంలో గ్రామంలో అంబులెన్స్ రావడానికి దారి లేకపోవటంలో గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, పాలనాధికారి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని వారు వాపోయారు, మట్టితో దారి ఏర్పాటు చేయటం వలన వర్షాకాలంలో బురదతో నిండిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని గ్రామస్థులు పేర్కొన్నారు. సరైన రహదారి నిర్మించుకుంటే ఎన్నికలు బహిష్కరిస్తామని, సోమవారం పొలిమేరలో నిసనలు తెలిపారు.  ఈ ఘటన నవరంగప్పర్ జిల్లా టెంటులి అంటి సమితి అమతగుడ పంచాయతి ఇంటియాగుడ గ్రామంలో జరిగింది. నవరంగపూర్ జాతీయ రహదారి -26 పై గ్రామస్థులు నిరసన తెలిపారు. ఈ విషయంపై బీడీవో మనోజ్ కుమార్ పాణిగ్రహీ మాట్లాడుతూ.. ఆయన మంగళవారం గ్రామానికి వెళ్లి గ్రామస్థులతో మాట్లాడుతానని, ఇంజినీర్‌తో చర్చించి వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని