logo

పాఠశాల నిర్మించుకుంటే.. ఎన్నికల బహిష్కరణ

40 ఏళ్ల క్రితం నిర్మించిన పాఠశాల మరమ్మతులకు గురైందని పలుమార్లు అధికారులు, రాజకీయ నేతల దృష్టికి తీసుకెళ్ళిన ఫలితం లేకపోయిందని స్థానికులు వాపోయారు.

Updated : 08 May 2024 17:15 IST

నవరంగపూర్‌: 40 ఏళ్ల క్రితం నిర్మించిన పాఠశాల మరమ్మతులకు గురైందని పలుమార్లు అధికారులు, రాజకీయ నేతల దృష్టికి తీసుకెళ్ళిన ఫలితం లేకపోయిందని స్థానికులు వాపోయారు. మంగళవారం నవరంగపూర్ జిల్లాలో కురిసిన వర్షం కారణంగా గత ఏడాది చందాలు వేసుకొని పాఠశాలకు వేసిన రేకులు ఎగిరిపోయాయని, అధికారులు పాఠశాల నిర్మాణం కోసం వెంటనే చర్యలు తీసుకోకపోతే ఎన్నికలు బహిష్కరిస్తామని పపదహండి సమితి తుంబర్ల పంచాయతి బగర్లా గ్రామానికి చెందిన ప్రజలు బుధవారం ఆందోళన చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని