logo

నెలకు 39 వేల పని దినాలు

ఈ ఆర్థిక సంవత్సరంలో జయపురం సమితికి నెలకి 34 వేల 481 పని దినాలు కల్పించనున్నట్టు జిల్లా అధికార యంత్రాంగం పేర్కొంది.

Published : 08 May 2024 16:38 IST

నవరంగపూర్‌: ఈ ఆర్థిక సంవత్సరంలో జయపురం సమితికి నెలకి 34 వేల 481 పని దినాలు కల్పించనున్నట్టు జిల్లా అధికార యంత్రాంగం పేర్కొంది. ఇందుకు వివిధ ప్రాజెక్టులలో పనులకు కూలీలను నియమించనున్నట్లు అధికారులు తెలిపారు. ఏడాదిలో 4 లక్షల 40వేల పని దినాలు పూర్తి చేయటం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 15,673 కుటుంబాలకు పనులు అప్పగిస్తామని, వారికి రూ.37.85కోట్ల వేతనాలు చెల్లించనున్నట్టు తెలిపారు. సమితిలో అత్యధికంగా పూజారపుటిలో " 4,959, తక్కువుగా పరి ఫట్‌లో 235 పని దినాలు ఉన్నాయి. మిగిలిన పంచాయతీలలో అంబాగుడ 1,345, అంతా 1,251, బడజివునా 1,083, బాలియం 2,123, బర్నిపుట్ 557, άదంగరంచి 722, ఏకంబ 514, బడపొదర 1930, హడియం 4,495, జాముండా 4,749, కాలిగావ్ 318, కెబిడి 2,015, కంగ 3,275, కుములిపుట్ 780, రండాపల్లి 2,171, రాణిగుండ 2,298, టంకువా 615, ఉమరి 1,708 పని దినాలు కేటాయించినట్లు సబ్‌ కలెక్టర్ ప్రభారత్ పరిడా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని