logo

ప్రజలకు అధికారుల ప్రోత్సాహం ఉండాలి: కలెక్టర్‌

కొవిడ్‌ సమయంలో వ్యాక్సిన్‌ తీసుకొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు, అటువంటి సమయంలో అధికారులే ప్రజలను ప్రోత్సహించాలని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అన్నారు.  

Updated : 21 Jan 2023 18:42 IST

సాలూరు గ్రామీణం: కొవిడ్‌ సమయంలో వ్యాక్సిన్‌ తీసుకొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు, అటువంటి సమయంలో అధికారులే ప్రజలను ప్రోత్సహించాలని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అన్నారు.  జగనన్న కాలనీలు, ఇళ్ల నిర్మాణాల విషయంలో కూడా అధికారులు ముందుకు వచ్చి ప్రోత్సాహం అందించాలని ఆయన వివరించారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో సాలూరు అర్బన్‌, రూరల్‌ పరిధిలోని గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అధికారులు తమకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో పార్వతీ, గృహ నిర్మాణశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని