logo

5 రేవుల్లో ఇసుక తవ్వకాలకు అనుమతి

జిల్లాలో కొత్త రేవులను గుర్తించి 2.46 టన్నుల ఇసుక తవ్వకానికి జిల్లా స్థాయి కమిటీ అనుమతులు ఇచ్చింది. శనివారం కలెక్టరు నిశాంత్‌కుమార్‌ అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో ఐదు కొత్త రేవుల నుంచి ఇసుక సేకరించి నిల్వ చేయాలని నిర్ణయించారు

Updated : 26 Mar 2023 06:38 IST

పార్వతీపురం, న్యూస్‌టుడే: జిల్లాలో కొత్త రేవులను గుర్తించి 2.46 టన్నుల ఇసుక తవ్వకానికి జిల్లా స్థాయి కమిటీ అనుమతులు ఇచ్చింది. శనివారం కలెక్టరు నిశాంత్‌కుమార్‌ అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో ఐదు కొత్త రేవుల నుంచి ఇసుక సేకరించి నిల్వ చేయాలని నిర్ణయించారు. తవ్వకాలకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రానున్న వర్షాకాలంలో ప్రభుత్వ అభివృద్ధి పనులు, నిర్మాణాలు చేపట్టడానికి ఇసుక కొరత రాకుండా చూడాలని కలెక్టర్‌ సూచించారు. రేవుల నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా పోలీసు యంత్రాంగం నిఘా చర్యలు చేపట్టాలన్నారు. ఇసుకను నిల్వ చేసేందుకు ప్రత్యేక కేంద్రాల ఏర్పాటుకు వీలుగా పరిశీలన చేయాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఒ.దిలీప్‌కిరణ్‌, గనుల శాఖ ఉప సంచాలకుడు బాలాజీనాయక్‌, సహాయ సంచాలకుడు మల్లేశ్వరరావు, డీపీవో బి.సత్యనారాయణ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని