logo

ఆధునికీకరణ పనులకు ఆటంకం

పాచిపెంట మండలంలోని పెద్దగెడ్డ జలాశయం ఆధునికీకరణ ప్రక్రియకు తరచూ ఆటంకం ఏర్పడుతోంది. జైకా నిధులు రూ.28.18 కోట్లు మంజూరు కావడంతో గతేడాది జనవరి 30న అభివృద్ధి పనులు ప్రారంభించారు.

Published : 01 Jun 2023 04:34 IST

మోసూరు సమీపంలోని కాలువలో చేరిన వర్షపు నీరు

పాచిపెంట, న్యూస్‌టుడే: పాచిపెంట మండలంలోని పెద్దగెడ్డ జలాశయం ఆధునికీకరణ ప్రక్రియకు తరచూ ఆటంకం ఏర్పడుతోంది. జైకా నిధులు రూ.28.18 కోట్లు మంజూరు కావడంతో గతేడాది జనవరి 30న అభివృద్ధి పనులు ప్రారంభించారు. అయితే కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో జాప్యం జరుగుతోంది. డిసెంబరు నాటికి పూర్తి చేయాలని ఉన్నతాధికారులు గడువు విధించారు. 18 కిలోమీటర్ల పొడవున ఉన్న ప్రధాన కాలువలో మట్టి, సబ్‌గ్రేడింగు, కాంక్రీట్ పనులు చేపట్టాల్సి ఉండగా ఇప్పటివరకు 10 కి.మీ. మేర మట్టి, 3 కి.మీ. సబ్‌గ్రేడింగ్‌, మూడు చోట్ల దాదాపు 2.50 కి.మీ. వరకు కాంక్రీట్ లైనింగ్‌ జరిగింది. ఇంతలోనే వర్షాలు రావడంతో అడ్డుకట్ట పడింది. మరోవైపు ఖరీఫ్‌ ప్రారంభం కానుండడంతో పూర్తిస్థాయిలో ఆధునికీకరణ ఆగిపోయే అవకాశం ఉంది. ఈ పరిస్థితిపై డీఈ కనకారావును ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా ప్రస్తుతం కాలువల్లో చేరిన నీటిని ఇంజిన్ల సాయంతో తోడుతున్నామని, వెంటనే పునఃప్రారంభిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని