logo

వైకాపాకు ముద్దాడ మధు రాజీనామా

విజయనగరం నియోజకవర్గంలో వైకాపాకు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు సీనియర్‌ నాయకులు ఆ పార్టీ వీడి తెదేపాలో చేరారు.

Updated : 25 Apr 2024 06:33 IST

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: విజయనగరం నియోజకవర్గంలో వైకాపాకు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు సీనియర్‌ నాయకులు ఆ పార్టీ వీడి తెదేపాలో చేరారు. తాజాగా ఆ పార్టీ విజయనగరం పార్లమెంటరీ, జిల్లా ప్రధాన కార్యదర్శి  ముద్దాడ మధు యాదవ్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు సంబంధిత పత్రాన్ని జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ద్వారా సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి పంపించానని బుధవారం ప్రకటించారు. ‘ఉత్తరాంధ్రలో యాదవులకు సీట్లు కేటాయించలేదు. విజయనగరంలో ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రాధాన్యం ఇవ్వలేదు. అయిదేళ్లుగా పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేసినా గుర్తించలేదు. జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌ పదవి ఇస్తామని చెప్పి మోసం చేశారు. రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యుడిగా చేస్తానని మాటిచ్చి, పక్కన పెట్టేశారు’ అని వాపోయారు. త్వరలో తెదేపాలో చేరుతున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని