logo

కార్యకర్తల భుజాలపై విజయచంద్ర ప్రచారం

బలిజిపేట మండలంలోని తుమరాడ గ్రామంలో శుక్రవారం ఎన్నికల ప్రచారానికి వచ్చిన తెదేపా అభ్యర్థి బోనెల విజయచంద్రను అక్కడి కార్యకర్తలు, వీరాభిమానులు భుజాలపై కూర్చొనబెట్టుకొని పురవీధుల్లో ఊరేగింపు చేశారు.

Updated : 04 May 2024 17:18 IST

బలిజిపేట: బలిజిపేట మండలంలోని తుమరాడ గ్రామంలో శుక్రవారం ఎన్నికల ప్రచారానికి వచ్చిన తెదేపా అభ్యర్థి బోనెల విజయచంద్రను అక్కడి కార్యకర్తలు, వీరాభిమానులు భుజాలపై కూర్చొనబెట్టుకొని పురవీధుల్లో ఊరేగింపు చేశారు. సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి విజయచంద్రను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలంటూ వీరు ఓటర్లను అభ్యర్థించారు. ఏదయ్యా మన గుర్తు సైకిల్, సైకిల్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తుమరాడ గ్రామప్రజలు తెదేపా అభ్యర్థికి ఎక్కడికక్కడ కుంకుమ తిలకాలు దిద్ది హారతులిచ్చారు. 

తెదేపాతోనే అభివృద్ధి సాధ్యం

అప్పుల ఊబిలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకువచ్చేందుకు చంద్రబాబునాయుడును రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా గెలిపించేందుకు అందరూ ముందుకు రావాలని తెదేపా పార్వతీపురం అభ్యర్థి బోనెల విజయచంద్ర అన్నారు. తెదేపా, జనసేన, భాజపా నాయకులతో కలసి శుక్రవారం ఆయన బలిజిపేట, వెంగాపురం, తుమరాడ గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైకాపా పాలన వల్ల రాష్ట్రప్రజలకు కలిగిన నష్టాల గురించి వివరించారు. తెదేపా అధికారంలోకి వస్తేనే సూపర్‌సిక్స్‌ పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి  చేకూరనుందన్నారు. కార్యక్రమంలో మండల తెదేపా అధ్యక్షులు పెంకి వేణుగోపాలనాయుడు, అరకు పార్లమెంట్‌ బీసీ సెల్‌ అధ్యక్షులు బూరాడ రామ్మోహనరావు, జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి పాలూరు బాబు, భాజపా మండల అధ్యక్షులు కేశవనాయుడు, తెదేపా సీనియర్‌ నాయకులు వి.నారాయణరావు, అక్కేన జగన్మోహనరావు, మరడ రాజు, మండల పెదపాపినాయుడు, భోగ రామారావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

పలువురు తెదేపాలోకి చేరిక...

బలిజిపేట మండలంలోని బర్లి గ్రామానికి చెందిన గుల్లిపల్లి కృష్ణమోహన్‌ అతనికి చెందిన వంద కుటుంబీకులు వైకాపాను వీడి తెదేపా తీర్థం  పుచ్చుకున్నారు. వీరికి విజయచంద్ర తెదేపా కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని