logo

ఆగు..ఆగు..దేవుడి మాన్యం డబ్బులేవీ?

అధికారం.. ఆపై ఎమ్మెల్యే.. ఇంకేముందు ఎక్కడ భూములు కనిపించినా కొనేస్తున్నారు బొత్స అప్పలనర్సయ్య. ఈ క్రమంలోనే దత్తిరాజేరు మండలం కె.కొత్తవలసలో దేవుడి మాన్యం కొన్నారు.

Published : 05 May 2024 05:14 IST

ఎమ్మెల్యే అప్పలనరసయ్య అడ్డగింత

 

ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య కారును చుట్టుముట్టిన కె.కొత్తవలస గ్రామస్థులు

దత్తిరాజేరు, న్యూస్‌టుడే: అధికారం.. ఆపై ఎమ్మెల్యే.. ఇంకేముందు ఎక్కడ భూములు కనిపించినా కొనేస్తున్నారు బొత్స అప్పలనర్సయ్య. ఈ క్రమంలోనే దత్తిరాజేరు మండలం కె.కొత్తవలసలో దేవుడి మాన్యం కొన్నారు. వాటికి సంబంధించి ఒప్పందం ప్రకారం గ్రామస్థులకు డబ్బులు ఇవ్వకపోవడంతో శనివారం అడ్డుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కె.కృష్ణాపురం నుంచి కె.కొత్తవలస వస్తుండగా ఊరి చివర కొంతమంది తెదేపా కార్యకర్తలు, స్థానికులు అడ్డుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడి నుంచి కదలనివ్వమని పట్టుబట్టారు. దీంతో ఎమ్మెల్యే తన కారులోనే ఉండిపోయారు.

అసలు కథ ఇదీ

కె.కొత్తవలసకు చెందిన 15 ఎకరాల దేవుని భూమి నలుగురు రైతుల పేరిట ఉండగా వారిలో ముగ్గురు రైతుల వద్ద ఎమ్మెల్యే రెండేళ్ల క్రితం 10 ఎకరాలు కొన్నారు. ఒకరు అయిదు ఎకరాలు అమ్మలేదు. మిగిలిన ముగ్గురు అన్నదాతలకు అప్పలనర్సయ్య కొంత సొమ్ము ఇచ్చారు. దేవుని మాన్యం కావడంతో గ్రామ పెద్దలు ఒక కమిటీగా ఏర్పడి బ్యాంకు ఖాతా తెరిస్తే మిగిలిన నగదును అందులో జమ చేస్తానని అప్పట్లో చెప్పారు. ఇన్నాళ్లూ జాప్యం చేస్తూ వచ్చారు. కమిటీ సభ్యుల్ని పిలిచి డబ్బు ఇవ్వకుండా గ్రామానికి చెందిన వైకాపా నాయకుడి చేతికి రూ.60 లక్షల చెక్కు ఇవ్వడం ఏంటని స్థానికులు మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని