logo

రాజీనామా చేసిన వాలంటీర్లకు జీతాలు చెల్లింపు

ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్లు పెద్ద ఎత్తున రాజీనామా చేస్తూ వస్తున్నారు. ఇలా ఉద్యోగాలు వదులుకున్న వారికి గౌరవవేతనం చెల్లించకూడదు.

Published : 07 May 2024 04:32 IST

రాజాం, న్యూస్‌టుడే: ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్లు పెద్ద ఎత్తున రాజీనామా చేస్తూ వస్తున్నారు. ఇలా ఉద్యోగాలు వదులుకున్న వారికి గౌరవవేతనం చెల్లించకూడదు. రాజాం మున్సిపాల్టీ పరిధిలో రాజీనామా చేసిన 16 మంది వాలంటీర్లకు గౌరవవేతనాలు మేనెలలో జమ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. పట్టణ పరిధిలో 11 సచివాలయాల్లో 210 మంది వార్డు వాలంటీర్లు ఉండగా వీరిలో 190 మంది రాజీనామా చేసినట్లు గుర్తించారు. ఇందులో 16 మందికి సంబంధించి ఒకొక్కరికి రూ.5 వేలు చొప్పున జమ కావడంతో అధికారులు కంగుతిన్నారు. వీరికి జీతాలు ఎలా జమయ్యాయనే అంశంపై ఆరా తీయగా.. జీతాలు బిల్లు పెట్టిన తరువాత వీరు రాజీనామా చేసినట్లు తేలింది. మున్సిపాల్టీలో ప్రతి నెలా 20వ తేదీకి జీతాల బిల్లులు సమర్పిస్తారు. ఈ తేదీ తరువాత రాజీనామా చేసిన వాలంటీర్లకు గౌరవ వేతనాలు మంజూరయ్యాయి. వీరి నుంచి రికవరీ చేస్తున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ జాగరపు రామ అప్పలనాయుడు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని