logo

ప్రజల భూములు కాజేసేందుకే నల్లచట్టం

ప్రజల భూములను కాజేసేందుకే వైకాపా ప్రభుత్వం ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టును అమలు చేసేందుకు నిర్ణయించిందని తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పడాల భూదేవి అన్నారు.

Published : 08 May 2024 04:40 IST

తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న తెదేపా నాయకులు

పాలకొండ, న్యూస్‌టుడే: ప్రజల భూములను కాజేసేందుకే వైకాపా ప్రభుత్వం ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టును అమలు చేసేందుకు నిర్ణయించిందని తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పడాల భూదేవి అన్నారు. ఈ నల్లచట్టాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం పాలకొండలో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆ పార్టీ నాయకులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రం ఈ చట్టాన్ని అమలు చేయలేదన్నారు. మన రాష్ట్రంలో గత ఏడాది అక్టోబరు 31 నుంచి అమల్లోకి వచ్చినట్లు జీవో నం.512ను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.  తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు  వెంకటరమణ, జడ్పీటీసీ మాజీ సభ్యుడు దామోదరరావు, తెలుగు యువత అరకు పార్లమెంటరీ అధ్యక్షుడు వారాడ సుమంత్‌నాయుడు, మండల అధ్యక్షుడు రామినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు