logo

మా ఓటెక్కడ?

ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలట్‌ విషయంలో గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. దరఖాస్తు చేసుకున్న వారిలో కొంతమందికి ఓట్లు లేకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated : 08 May 2024 07:28 IST

ఉద్యోగులకు అవస్థలు

సహాయక కేంద్రం వద్ద సమాచారం తీసుకుంటున్న ఉద్యోగులు

విజయనగరం అర్బన్‌, ఉడాకాలనీ, న్యూస్‌టుడే: ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలట్‌ విషయంలో గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. దరఖాస్తు చేసుకున్న వారిలో కొంతమందికి ఓట్లు లేకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు ఫారం- 12డి ఇవ్వకపోవడంతో ఓటు వేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇలాంటి వారంతా సొంత జిల్లాలకు వెళ్లి ఓటేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికిప్పుడు ఎలా వెళ్లాలని అధికారులను నిలదీస్తున్నారు. కావాలనే జాబితాల్లో పేర్లు లేకుండా చేశారని మండిపడుతున్నారు. తమను జేఎన్‌టీయూకు వెళ్లాలని సూచించారని, ఇక్కడకొస్తే సొంత నియోజకవర్గంలోని ఫెసిలిటేషన్‌ కేంద్రాలకు వెళ్లాలని లెటర్‌ ఇస్తున్నారని గంట్యాడ మండలంలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిని, గజపతినగరంలో పనిచేస్తున్న ఓ అధ్యాపకుడు, రాజాం నియోజకవర్గం వంగరలో పనిచేస్తున్న ఉద్యోగి వాపోయారు.

నేటితో ముగియనున్న గడువు..: ఈ నెల అయిదో తేదీన బ్యాలట్‌ ప్రక్రియ ప్రారంభమైంది. మంగళవారం నాటికి మూడో రోజుకు చేరుకుంది. బుధవారంతో గడువు ముగియనుంది. సోమవారం నాటికి ఏడు నియోజకవర్గాల్లో 6,005 బ్యాలెట్లు నమోదయ్యాయి. ఇందులో ఇతర జిల్లాల వారు 1039 ఉన్నట్లు అధికారిక గణాంకాల బట్టి తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు