logo

ఎన్నారైకు శిశుగృహ చిన్నారి దత్తత

హైదరాబాద్‌కు చెందిన అజయ్‌గోపి దంపతులు అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో సొంత సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నిర్వహిస్తూ అక్కడే స్థిరపడ్డారు.

Published : 23 May 2024 02:34 IST

 కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ నుంచి పాప దత్తత  పత్రాలు తీసుకుంటున్న దంపతులు  

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: హైదరాబాద్‌కు చెందిన అజయ్‌గోపి దంపతులు అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో సొంత సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నిర్వహిస్తూ అక్కడే స్థిరపడ్డారు. సదరు దంపతులు జిల్లా మహిళ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒంగోలులోని శిశుగృహానికి చెందిన పాపను దత్తత తీసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు స్థానిక క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ చేతుల మీదుగా ఆ చిన్నారికి సంబంధించిన దత్తత పత్రాలు అందుకున్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళ, శిశు సంక్షేమశాఖ అధికారి కె.మాధురి, జిల్లాల బాలల సంరక్షణ అధికారి పి.దినేష్‌కుమార్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని