logo

వైభవంగా చెన్నకేశవుని బ్రహ్మోత్సవాలు

గొల్లపల్లిలో చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో గ్రామంలో సందడి నెలకొంది. ఇందులో భాగంగా గురువారం కంపకళ్లి వేడుకలు నిర్వహించనున్నారు.

Published : 23 May 2024 02:39 IST

నేడు కంపకళ్లి వేడుకలు 

గరుడ వాహనంపై దర్శనమిచ్చిన స్వామి 

హనుమంతునిపాడు, న్యూస్‌టుడే : గొల్లపల్లిలో చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో గ్రామంలో సందడి నెలకొంది. ఇందులో భాగంగా గురువారం కంపకళ్లి వేడుకలు నిర్వహించనున్నారు. బుధవారం గరుడ వాహనంపై చెన్నకేశవ స్వామి దర్శనమిచ్చారు. భక్తులు స్వామి వారి ఆశీస్సులందుకున్నారు. గ్రామంలో అయిదు రోజులపాటు జరిగే తిరునాళ్లకు భక్తులు భారీగా తరలి రావడంతో పోలీసులు  బందోబస్తు ఏర్పాటు చేశారు. కనిగిరి సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై శివనాగరాజు, తెదేపా మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, గాయం తిరుపతిరెడ్డి, రఘునాథ కాశిరెడ్డి మొక్కులు తీర్చుకున్నారు. చెక్కా వంశీయులు చెన్నకేశవునికి నిత్య పొంగళ్లు సమర్పించారు. పాలేగాళ్లు, పోతురాజులు కత్తిసేవలతో స్వామి వారి మహిమను చాటారు. భక్తులు స్వామి వారికి పొంగళ్లు సమర్పించి, ముడుపులు చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. దేవాదాయ శాఖ అధికారులు జనార్దన్‌ రెడ్డి, ఈవో శ్రీనిబాబు, సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం నిర్వహించే కంపకళ్లి వేడుకల్లో గుట్టపై నుంచి పసిపిల్లల్ని దొర్లించవద్దని పోలీసులు, ఐసీడీఎస్‌ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 


వేంకన్నను దర్శించుకున్న మాగుంట

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే : ఒంగోలు సిట్టింగ్‌ ఎంపీˆ, కూటమి అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి బుధవారం తిరుమలలో కలియుగ దైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వేకువజామున దేవ దేవుడికి నిర్వహించిన సుప్రభాత సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు తీర్థ, ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలు అందించారు. ఆయనతో పాటు పలువురు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని