logo
Published : 29/11/2021 04:53 IST

కవులు.. రచయితలతోనేభాషా సంస్కృతుల పరిరక్షణ

మండలి బుద్ధ ప్రసాద్‌ను సన్మానిస్తున్న కళా

మిత్ర మండలి ప్రతినిధులు.. చిత్రంలో కళాకారులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: భాషా సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునేందుకు అందరూ భాగస్వాములు కావాలని మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్‌ కోరారు. కళామిత్ర మండలి 15వ వార్షికోత్సవాన్ని స్థానిక ఎన్టీఆర్‌ కళాక్షేత్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బుద్ధ ప్రసాద్‌ హాజరై మాట్లాడారు. భాషా సంస్కృతులను ఆదరించాల్సిన ప్రభుత్వమే అసెంబ్లీలో సభా మర్యాదలు మరిచిపోయి, అసభ్య పదజాలం ఉపయోగించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. సాహిత్య సంస్థలు, కవులు, రచయితలతోనే భాషా సంస్కృతుల పరిరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు. అనంతరం నూనె వెంకాయమ్మ, వెంకటరత్నం స్మారక జీవన సాఫల్య పురస్కారాన్ని బుద్ధ ప్రసాద్‌కు అందజేశారు. నాగభైరవ, మండవ కుటుంబ సభ్యులు శ్రీకొంపల్లి బాలకృష్ణ సాహితీ ప్రతిభా పురస్కారాన్ని కె.వెంకట రమణమూర్తి(పశ్చిమ గోదావరి)తో పాటు, పలువురికి ప్రతిభా పురస్కారాలను అందజేశారు. తొలుత తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నరసం గౌరవ అధ్యక్షురాలు టి.అరుణ, కళామిత్ర మండలి జాతీయ అధ్యక్షుడు నూనె అంకమ్మరావు, సాహితీ సేవకులు వీరవల్లి సుబ్బారావు, పోతుల పెద వీరనారాయణ, కుర్రా ప్రసాద్‌బాబు, మిడసల మల్లిఖార్జునరావు, తెదేపా మహిళా నాయకురాలు కె.కుసుమకుమారి, రావుల పద్మజ, టి.రమాదేవి, నాళం నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. కళామిత్ర మండలి జాతీయ అధ్యక్షుడు నూనె అంకమ్మరావు రచించిన ‘సాహితీమూర్తులు’ గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని