logo

అక్రమార్కులచెరలో నీటి కుంటలు !

మనిషి జీవనానికి ప్రాణాధారమైన నీరు నిలిచేందుకు భూమి మీద చోటు లేకుండా పోతోంది. చెరువులు, కుంటలు అక్రమార్కుల చేతుల్లో కుంచించుకుపోతున్నాయి. జిల్లాలో సుమారు పది వేల నీటి కుంటలు ఉంటాయని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. మార్కాపురం డివిజన్‌ పరిధిలోని గిద్ద

Published : 27 Jan 2022 06:24 IST
చిత్రంలో కనిపిస్తున్న ఈ నీటి కుంట నాగులవరం సమీపంలోని ప్రధాన రహదారి పక్కన సర్వే నంబరు 1,373లో 11.41 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అయితే కొందరు దీన్ని ఆక్రమించి సాగు భూమిగా మార్చారు. దీంతో నీటి నిల్వ విస్తీర్ణం అరెకరానికి కుంచించుకుపోయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్ఛు ఇలాంటి ఆక్రమిత కుంటలు ఒక్క నాగులవరంలోనే మరో అయిదు ఉన్నాయి.

అర్థవీడు, న్యూస్‌టుడే : మనిషి జీవనానికి ప్రాణాధారమైన నీరు నిలిచేందుకు భూమి మీద చోటు లేకుండా పోతోంది. చెరువులు, కుంటలు అక్రమార్కుల చేతుల్లో కుంచించుకుపోతున్నాయి. జిల్లాలో సుమారు పది వేల నీటి కుంటలు ఉంటాయని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. మార్కాపురం డివిజన్‌ పరిధిలోని గిద్దలూరు, యర్రగొండపాలెం, మార్కాపురం నియోజకవర్గాల పరిధితో సుమారు 500 కుంటలు ఆక్రమణల్లో ఉన్నట్లు గత ప్రభుత్వ హయాంలో అధికారులు గుర్తించారు. ఒక్క అర్థవీడు మండలంలోనే 30 కుంటలు ఆక్రమణల్లో ఉన్నాయి. వీటి పరిధిలో 200 ఎకరాలకు పైగా విస్తీర్ణం ఉన్నట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం భూముల ధరలకు రెక్కలు రావడంతో రెవెన్యూ హక్కులు పొందేందుకు కూడా ఆక్రమార్కులు వెనుకాడటం లేదు.

ఎమ్మెల్యే హెచ్చరించినా...

గత నెల 20న మండల సర్వ సభ్య సమావేశంలో కుంటల ఆక్రమణలపై పలు గ్రామాల ప్రజాప్రతినిధులు ఫిర్యాదులు చేశారు. వీటిని పరిశీలించిన గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ వర్షాలు కురవడంతో కుంటలన్నీ నీటితో నిండుకున్నాయని, ఈ సమయంలో నీరు ఎంత వరకు ఉంటే అంత వరకు కుంట విస్తీర్ణం ఉన్నట్టు అధికారులు గుర్తించి ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. సభాముఖంగా ఆయన ఆదేశాలిచ్చి నెల రోజులు దాటినా చర్యలు లేకపోవడం శోచనీయం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని