logo

హామీల అమలుకు నినదించిన అన్నదాతలు

దిల్లీ రైతు ఉద్యమ నాయకులకు కేంద్ర ప్రభుత్వం రాత పూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకులు డిమాండ్‌ చేశారు.

Published : 27 Jan 2023 02:13 IST

ట్రాక్టర్లతో ర్యాలీలో పాల్గొన్న  నాయకులు, కర్షకులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: దిల్లీ రైతు ఉద్యమ నాయకులకు కేంద్ర ప్రభుత్వం రాత పూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒంగోలు నగరంలో ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల ర్యాలీని ఒంగోలులో గురువారం నిర్వహించారు. దక్షిణ బైపాస్‌లోని మినీ స్టేడియం నుంచి ప్రకాశం భవన్‌, ట్రంక్‌రోడ్డు, అద్దంకి బస్టాండ్‌ మీదుగా ఉత్తర బైపాస్‌ వరకు ప్రదర్శన కొనసాగింది. ఈ సందర్భంగా రైతు సంఘాల జిల్లా కన్వీనర్‌ చుండూరి రంగారావు మాట్లాడుతూ.. దిల్లీ ఉద్యమ రైతులకు ఇచ్చిన హామీ మేరకు కనీస మద్దతు ధర, రైతు విమోచన చట్టాలు అమలుతో పాటు, విద్యుత్తు చట్ట సవరణ బిల్లు-2022 ఉపసంహరించుకోవాలని కోరారు. పంటలకు ఎం.ఎస్‌.స్వామినాథన్‌ సిఫార్సు చేసిన పద్ధతిలో మద్దతు ధర కల్పించాలన్నారు. కార్యక్రమంలో పలు రైతు, రైతు కూలీ సంఘాల నాయకులు పమిడి వెంకటరావు, వి.హనుమారెడ్డి, చుంచు శేషయ్య, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, పీవీఆర్‌ చౌదరి, లలితకుమారి, గాలం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని