logo

పోలింగ్‌ కేంద్రాల్లో వసతులు కల్పించాలి

పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.

Published : 05 May 2024 02:34 IST

ఓటింగ్‌పై ఆరా తీస్తున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా తొలిరోజైన శనివారం అన్ని నియోజకవర్గాల్లో పీవో, ఏపీవోలకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియను ప్రారంభించగా.. స్థానిక డీఆర్‌ఆర్‌ఎం ఉన్నత పాఠశాలలో ఓటింగ్‌ జరుగుతున్న తీరును కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ పరిశీలించారు. పొరుగు జిల్లాలో ఓటు ఉండి, ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగుల కోసం జిల్లా కేంద్రమైన ఒంగోలులోని కేంద్రీయ విద్యాలయంలో ఈ నెల 6వ తేది నుంచి 8వ తేది వరకు ఓటు వేసేలా ఫెసిలిటేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఒంగోలు ఆర్డీవో జీవీ.సుబ్బారెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్‌ జస్వంతరావు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని