logo

పోలింగ్‌కు ఇదేం సన్నద్ధత!

తపాలా ఓటింగ్‌ మొదటి రోజైన శనివారం జిల్లాలో పలు చోట్ల అధికారులు నిర్లిప్తంగా వ్యవహరించారు. ఒంగోలు డీఆర్‌ఆర్‌ఎం ఉన్నత పాఠశాలలోని సగం కేంద్రాల్లో గెజిటెడ్‌ అధికారులు అందుబాటులో లేరు.

Published : 05 May 2024 02:45 IST

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: తపాలా ఓటింగ్‌ మొదటి రోజైన శనివారం జిల్లాలో పలు చోట్ల అధికారులు నిర్లిప్తంగా వ్యవహరించారు. ఒంగోలు డీఆర్‌ఆర్‌ఎం ఉన్నత పాఠశాలలోని సగం కేంద్రాల్లో గెజిటెడ్‌ అధికారులు అందుబాటులో లేరు. దీంతో ఉదయం 11 గంటల వరకు పోలింగ్‌ ప్రారంభించలేదు.

  • దర్శిలో రెండున్నర గంటలు ఆలస్యంగా ప్రక్రియ ప్రారంభమైంది. సిబ్బంది విధులకు ఆలస్యంగా రావడం, ఏజెంట్ల ఏర్పాటు ప్రక్రియ ఆలస్యం కావడంతో ఓటు వేయాలని వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
  • కనిగిరిలోనూ నిరీక్షణ తప్పలేదు. ముందుగా అధికారులెవరూ రాలేదు. నీడ సౌకర్యం కూడా లేకపోయింది.
  • మార్కాపురంలో అధికార పార్టీ నేతలు ప్రలోభాలకు తెర లేపారు. ఓ కౌన్సిలర్‌తో పాటు ఆ పార్టీ నాయకులు పోలింగ్‌ కేంద్రం బయట ఉద్యోగులకు ఎర వేసే ప్రయత్నాలు చేశారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని