logo

బాలికలదే పైచేయి!

పదో తరగతి ఫలితాల్లో సిక్కోలు విద్యార్థులు సత్తా చాటారు. గతేడాది మాదిరిగానే జిల్లా రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచింది.

Published : 23 Apr 2024 03:45 IST

పది ఫలితాల్లో సిక్కోలు విద్యార్థుల సత్తా
రాష్ట్రస్థాయిలో జిల్లాకు రెండో స్థానం
న్యూస్‌టుడే, కలెక్టరేట్‌(శ్రీకాకుళం)

శ్రీకర్‌(597), కాశీబుగ్గ

దో తరగతి ఫలితాల్లో సిక్కోలు విద్యార్థులు సత్తా చాటారు. గతేడాది మాదిరిగానే జిల్లా రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. అప్పటి కంటే ఫలితాల శాతం మెరుగైంది. బాలుర కంటే బాలికలు పైచేయి సాధించారు. మొత్తం 28,745 మంది విద్యార్థులు హాజరుకాగా.. వారిలో 26,833 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 14,712 మందికిగాను 13,489 పాసయ్యారు. బాలికలు 14,033 మందికి 13,344 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 93.35 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

శ్రీవల్లి (595), కోటబొమ్మాళి ,    భాగ్యశ్రీ(596), మందస 

ప్రథమ శ్రేణిలో 23,157 మంది: రాష్ట్రస్థాయి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన జాబితాలో జిల్లా విద్యార్థులే అగ్రస్థానంలో నిలిచారు. 28,745 మంది పరీక్ష రాయగా.. 23,157 మంది ప్రథమ, 2,774 మంది ద్వితీయ, 902 మంది తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని