logo

ఒక్క భవనం.. ఐదేళ్లు గ్రహణం

గ్రామీణ ప్రాంతాల పురోగతికి మండల పరిషత్‌ అభివృద్ధి కార్యాలయం కీలకం.

Published : 25 Apr 2024 04:14 IST

గ్రామీణ ప్రాంతాల పురోగతికి మండల పరిషత్‌ అభివృద్ధి కార్యాలయం కీలకం. ఇక్కడ నుంచే అన్ని శాఖాధికారులు పర్యవేక్షణ చేస్తూ పల్లె ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. ప్రస్తుతం ఆ కార్యాలయాలకు కాలం చెల్లాయి. గోడల బీటలు వారి, పైకప్పు పెచ్చులూడి శిథిలావస్థకు చేరుకుంది. చిన్న చినుకుకే నీటి నిల్వలు చేరి దస్త్రాలు తడిసి ముద్దవుతున్నాయి. ఇబ్బందులు తెలుసుకున్న తెదేపా ప్రభుత్వం అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న గౌతు శివాజీ ఆధ్వర్యంలో 2017 నవంబరులో నూతన కార్యాలయం ఏర్పాటుకు నడుం బిగించింది. పంచాయతీరాజ్‌ నిధులు రూ. కోటితో పనులు ప్రారంభించింది. 2019 ఎన్నికల నిర్మాణ పనులు తుది దశకు చేరుకుంది. వైకాపా గద్దెనెక్కింది. భవనానికి గ్రహణం పట్టింది. ఐదేళ్లు దిష్టిబొమ్మలా వదిలేశారే తప్ప పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురాలేకపోయారు. వినియోగించకపోవడంతో భవనం పాడవుతోంది. ప్రజలకు అవసరమైన కార్యాలయ భవనం స్వార్థ రాజకీయాలతో నిరపయోగంగా మార్చారని పలువురు అభిప్రాయ పడ్డారు. ప్రస్తుత పాలకులను తిట్టిపోస్తున్నారు.

న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు


న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

సమస్య: మండలం పరిధి డెప్పూరు గ్రామానికి వెళ్లే మట్టిరోడ్డు మరమ్మతులు చేసి, ఇరువైపులా ముళ్ల పొదలు తొలగించాలి. 

ధర్మారావు, స్థానికుడు

సమాధానం: ఆ ప్రాంతాన్ని పరిశీలించి రోడ్డుతో పాటు ఇతర సమస్య పరిష్కరిస్తాం.

కె.రామారావు, ఏవో

సమస్య: ఇచ్ఛాపురం పుర దినవారీ బజారుకు గేట్లు లేకపోవడం వల్ల పశుసంచారంతో అవస్థలు పడుతున్నాం.

కాయ దేవమ్మ, ఇచ్ఛాపురం

సమాధానం: మోడల్‌ మార్కెట్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నాయి. వాటితో పాటు గేట్ల సమస్య పరిష్కరిస్తాం.

ఎన్‌.రమేష్‌, కమిషనరు, ఇచ్ఛాపురం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని