logo

మాటకు కట్టుబడి రహదారి నిర్మాణానికి సన్నాహాలు

ఆయన ఏ పార్టీలో ఉంటే తనతో పాటే ఆ అయిదు గ్రామాల ప్రజలు ఉంటారు. ఇటీవల వైకాపా నుంచి 2 వేల మందితో తెదేపాలో చేరిన కరగాం సర్పంచి పంగ బావాజీనాయుడు పెద్ద కరగాం గ్రామ శ్మశానవాటికకు రహదారి నిర్మాణానికి సొంత నిధులు వెచ్చిస్తున్నారు.

Published : 08 May 2024 05:09 IST

వైకాపా దగా ఫలితంగానే అంటున్న కరగాం సర్పంచి బావాజీనాయుడు

కరగాంలో ప్రచారం చేస్తున్న పంగ బావాజీనాయుడు, కూటమి నేతలు

నరసన్నపేట, న్యూస్‌టుడే: ఆయన ఏ పార్టీలో ఉంటే తనతో పాటే ఆ అయిదు గ్రామాల ప్రజలు ఉంటారు. ఇటీవల వైకాపా నుంచి 2 వేల మందితో తెదేపాలో చేరిన కరగాం సర్పంచి పంగ బావాజీనాయుడు పెద్ద కరగాం గ్రామ శ్మశానవాటికకు రహదారి నిర్మాణానికి సొంత నిధులు వెచ్చిస్తున్నారు. ఈ మేరకు భూమిని కొనుగోలు చేశారు. బావాజీనాయుడు భార్య రాష్ట్ర వెలమ కార్పొరేషన్‌ అధ్యక్షురాలిగా ఉండగా ఇటీవల వైకాపాను వీడారు. అయిదేళ్లలో పెద్ద కరగాం శ్మశానవాటిక, రహదారి నిర్మాణం చేపట్టలేదు. వైకాపా ప్రభుత్వం తమ గ్రామాలను దగా చేసిందని భావించిన బావాజీనాయుడు పార్టీని వీడారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సొంత నిధులతో పనులు చేపడుతున్నారు. కరగాంలో మంగళవారం తెదేపా ఇంటింటా ప్రచారంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. నాయకులు శిమ్మ లక్ష్మణరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు