logo

తెదేపాలో చేరితే ఇంట్లో సామగ్రి కాల్చేశారు

హనుమంతునాయుడుపేట పంచాయతీ పోతునాయుడుపేట కాలనీలో నివాసముంటున్న బేతాల ఈశ్వరరావు, కవిత దంపతుల ఇంటి సామగ్రిని గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి దహనం చేశారు.

Updated : 09 May 2024 06:23 IST

 ఈశ్వరరావు ఇంట్లో కాలిపోయిన సామగ్రి
సంతబొమ్మాళి, న్యూస్‌టుడే: హనుమంతునాయుడుపేట పంచాయతీ పోతునాయుడుపేట కాలనీలో నివాసముంటున్న బేతాల ఈశ్వరరావు, కవిత దంపతుల ఇంటి సామగ్రిని గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి దహనం చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమంతునాయుడుపేట సర్పంచి ప్రతినిధి పాల మహేష్‌, జడ్పీటీసీ సభ్యుడు పాల వసంతరెడ్డిల ప్రోత్సాహంతో అదే గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్తలు సామగ్రి కాల్చేశారు. గతంలో ఈశ్వరరావు ఇంటిలో కుటుంబ సభ్యులతో ఉండగా సర్పంచి ప్రతినిధి మహేష్‌ అనుచరులు దౌర్జన్యంగా దాడి చేసి భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో గ్రామంలో సర్పంచి ప్రతినిధి ఆగడాలు తట్టుకోలేక ఇటీవల తెదేపాలో చేరారు. ఈ ఇంట్లో 20 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. దీంతో రెవెన్యూ అధికారులు ఇచ్చిన పొజిషన్‌ సర్టిఫికెట్‌ ప్రకారం శ్లాబ్‌ ఇల్లు కట్టుకోవాలని ఇనుప రేకులు తొలగించారు. ఇంట్లో పరదాలతో పాటు ఇతర సామగ్రి ఉన్న సమయంలో మంగళవారం రాత్రి వైకాపా నాయకులు ఆయన ఇంటిలో సామగ్రిని దహనం చేశారు.  అనుమానితులుగా భావిస్తున్న అయిదుగురు వ్యక్తులపై బాధితుడు నౌపడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనా స్థలానికి నౌపడ ఎస్సై కిశోర్‌వర్మ, సిబ్బంది చేరుకొని ఆరా తీశారు. ఈ ఇంటిపై ఏడాదిగా తగాదా నడుస్తోందని, ఎటువంటి రాజకీయ కారణాలు లేవని ఎస్సై తెలిపారు.

ఇలాంటి ఘటనలకు పాల్పడం సరికాదు..  ఘటనను తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలకు పాల్పడటం సరికాదన్నారు. బాధితుడికి న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలని తెదేపా మండల నాయకులు అట్టాడ రాంప్రసాద్‌, విష్ణుమూర్తి, భాస్కరరావు తదితరులకు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని