logo

శివ, తిరుప్పూర్‌ కుమరన్‌కు గవర్నర్‌ నివాళి

స్వాతంత్య్ర సమరయోధులు సుబ్రహ్మణ్య శివ, తిరుప్పూర్‌ కుమరన్‌ జయంతి సందర్భంగా గవర్నర్‌ రవి నివాళి అర్పించారు. గిండిలోని రాజ్‌భవన్‌లో వారి చిత్రపటాలకు మంగళవారం పుష్పాంజలితో నివాళి అర్పించారు.

Published : 05 Oct 2022 01:27 IST

సుబ్రహ్మణ్య శివ, తిరుప్పూర్‌ కుమరన్‌ల చిత్రపటాలకు నివాళులర్పిస్తున్న ఆర్‌ఎన్‌ రవి

చెన్నై, న్యూస్‌టుడే: స్వాతంత్య్ర సమరయోధులు సుబ్రహ్మణ్య శివ, తిరుప్పూర్‌ కుమరన్‌ జయంతి సందర్భంగా గవర్నర్‌ రవి నివాళి అర్పించారు. గిండిలోని రాజ్‌భవన్‌లో వారి చిత్రపటాలకు మంగళవారం పుష్పాంజలితో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్వాతంత్య్ర ఉద్యమంలో సుబ్రహ్మణ్య శివ, తిరుప్పూర్‌ కుమరన్‌ దేశభక్తి, త్యాగం అసాధారణమని తెలిపారు. సుబ్రహ్మణ్యశివ తన జీవితం మొత్తాన్ని దేశం కోసం అర్పించారని పేర్కొన్నారు. తిరుప్పూర్‌ కుమరన్‌ పోలీసుల లాఠీ దెబ్బలు, తుపాకీ కాల్పులకు భయపడకుండా తుదిశ్వాస వరకు ‘వందే మాతరం’ నినాదంతో త్రివర్ణ పతాకాన్ని చేతపట్టారని వెల్లడించారు. వారి జీవితం భావితరాలకు ఆదర్శంగా ఉంటుందని తెలిపారు. గవర్నర్‌ ముఖ్యకార్యదర్శి ఆనంద్‌రావు వి.పాటిల్‌, రాజ్‌భవన్‌ ఉద్యోగులు పాల్గొని నివాళులర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని