logo

అధ్యాపకుల డిమాండ్లు నెరవేరుస్తాం

పార్ట్‌ టైమ్‌ ఉపాధ్యాయుల డిమాండ్లను ప్రభుత్వ ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా దశలవారీగా నెరవేరుస్తామని పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేశ్‌ తెలిపారు.

Published : 04 Feb 2023 00:38 IST

మంత్రి అన్బిల్‌ మహేశ్‌

ర్యాలీలో పాల్గొన్న అన్బిల్‌ మహేశ్‌

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: పార్ట్‌ టైమ్‌ ఉపాధ్యాయుల డిమాండ్లను ప్రభుత్వ ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా దశలవారీగా నెరవేరుస్తామని పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేశ్‌ తెలిపారు. అన్నాదురై వర్ధంతి సందర్భంగా తిరుచ్చి దక్షిణ జిల్లా డీఎంకే తరఫున మంత్రి అన్బిల్‌ మహేశ్‌ నేతృత్వంలో మౌన ర్యాలీ శుక్రవారం తిరుచ్చి సత్రం బస్టాండ్‌ వద్ద ప్రారంభమై చింతామణిలోని అన్నా విగ్రహం వద్ద ముగిసింది. అనంతరం విగ్రహానికి మంత్రి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... పార్ట్‌టైం ఉపాధ్యాయుల పోరాటం ప్రారంభించిన నాడే చర్చలు జరిపామని చెప్పారు. 30 జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారని తెలిపారు. దీని గురించి ముఖ్యమంత్రితో మాట్లాడినట్లు పేర్కొన్నారు. ఓ మంచి నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం తీసుకుంటుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వారి డిమాండ్లు ఏవైనా దశలవారీగా నెరవేరుస్తామని చెప్పారు. ఈరోడ్‌ తూర్పు నియోజకవర్గంలో విజయవకాశాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. ఇళంగోవన్‌ వెళ్లే ప్రతిచోట ప్రజల ఆదరణ బాగా ఉందన్నారు. 50 వేల ఓట్ల తేడాతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని