logo

అన్ని భాషల్లోకి భారతియార్‌ రచనలు

అన్ని భాషల్లోకి భారతియార్‌ రచనలను తీసుకెళ్లాలని పాండిచ్చేరి విశ్వవిద్యాలయం ఉప కులపతి గుర్మీత్‌ సింగ్‌ తెలిపారు. 

Published : 01 Apr 2023 05:32 IST

కార్యక్రమంలో పాల్గొన్న గుర్మీత్‌ సింగ్‌ తదితరులు

చెన్నై, న్యూస్‌టుడే: అన్ని భాషల్లోకి భారతియార్‌ రచనలను తీసుకెళ్లాలని పాండిచ్చేరి విశ్వవిద్యాలయం ఉప కులపతి గుర్మీత్‌ సింగ్‌ తెలిపారు.  వర్సిటీలో సుబ్రహ్మణ్య భారతి పీఠం ప్రారంభోత్సవ కార్యక్రమం, ‘భారతియార్‌ జీవితం, రచనలు’పై జాతీయ సదస్సు శుక్రవారం జరిగాయి. వీటిని వీసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 39ఏళ్లలోపు తన జీవితం, రచనల ద్వారా భారతియార్‌ అత్యంత పేరుప్రతిష్ఠలు పొందారన్నారు. ఆయన రచనలను పలు భాషల్లోకి తీసుకెళ్లాలని, అదే భారతి పీఠం లక్ష్యం కావాలని తెలిపారు. భారతి పీఠం బాధ్యులు రవికుమార్‌, మద్రాసు విశ్వవిద్యాలయం తమిళ విభాగాధిపతి   మణికంఠన్‌, భారతి డాక్యుమెంటరీ దర్శకుడు జ్ఞానరాజశేఖరన్‌, రచయిత, సినీ దర్శకుడైన భారతి కృష్ణకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని