logo

పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణ

ఈసీఆర్‌ రోడ్డులోని ‘తమిళనాడు టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌’ ఆధ్వర్యంలో నడుస్తున్న ముట్టుక్కాడులో పర్యాటకులను ఆకర్షించేందుకు సరికొత్త డబుల్‌ డెక్కర్‌ ఫ్లోటింగ్‌ రెస్టారెంట్(నీటిలో తేలియాడే)అందుబాటులోకి రానుంది.

Published : 05 May 2024 00:07 IST

నీటిలో తేలియాడే సీన్జ్‌ క్రూయిజ్‌

వడపళని, న్యూస్‌టుడే: ఈసీఆర్‌ రోడ్డులోని ‘తమిళనాడు టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌’ ఆధ్వర్యంలో నడుస్తున్న ముట్టుక్కాడులో పర్యాటకులను ఆకర్షించేందుకు సరికొత్త డబుల్‌ డెక్కర్‌ ఫ్లోటింగ్‌ రెస్టారెంట్(నీటిలో తేలియాడే)అందుబాటులోకి రానుంది. 125 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పు ఉన్న ఈ పడవను కొచ్చిన్‌కు చెందిన ‘గ్రాండ్యుయర్‌ మెరైన్‌ ఇంటర్నేషనల్‌’, తమిళనాడు టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ సంస్థలు రూ.5 కోట్లతో సిద్ధం చేశాయి. రెస్టారెంట్ ఏసీతో కూడుకుని ఉంటుంది. మొదటి అంతస్తు ఖాళీగా, పై అంతస్తులో కూర్చుని అల్పాహారం తీసుకునేందుకు వీలుగా ఉండనుంది. వంట, స్టోరేజి గది, మరుగుదొడ్డి, ఇంజిను గది ఉంటాయి. 60 హార్స్‌ పవర్‌తో(హెచ్‌పీ) నడిచేలా ఫ్లోటింగ్‌ పడవ డిజైన్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని