logo

ఆసక్తి జతగా.. వైవిధ్యం కలబోతగా!!

రెడ్డికంచరపాలెంకు చెందిన బి.రవిశంకర్‌రెడ్డి (50) తన విభిన్న ఆసక్తితో ఆకట్టుకుంటున్నారు. ఈయన రాజస్థాన్‌లో ఓ ఆయిల్‌ కంపెనీలో ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. కొత్త నమూనాల్లో సైకిళ్లు, ఇతర పరికరాలు తయారు చేయడమంటే ఇష్టం. అందుకే

Published : 25 Jan 2022 04:50 IST

ఒకే చక్రం ఉన్న సైకిల్‌ తొక్కుతూ...

రెడ్డికంచరపాలెంకు చెందిన బి.రవిశంకర్‌రెడ్డి (50) తన విభిన్న ఆసక్తితో ఆకట్టుకుంటున్నారు. ఈయన రాజస్థాన్‌లో ఓ ఆయిల్‌ కంపెనీలో ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. కొత్త నమూనాల్లో సైకిళ్లు, ఇతర పరికరాలు తయారు చేయడమంటే ఇష్టం. అందుకే ఖాళీ సమయంలో ఆ దిశగా అలుపెరగని ప్రయత్నం చేశారు. తాను తయారు చేసిన ఒకే చక్రంతో ఉన్న  సైకిల్‌పై 1400 మీటర్లు తొక్కిన రికార్డును లిమ్కాబుక్‌ఆఫ్‌ రికార్డ్స్‌కు పంపారు. ముందుకు, వెనక్కి తొక్కగలిగేలా, సైకిల్‌ను తొక్కుతుండగా ఫెడల్‌ను వెనక్కి తొక్కితే బ్రేక్‌ పడేలా కొన్ని రూపొందించారు. అలాగే హ్యాండిల్‌ కుడివైపునకు తిప్పితే ఎడమకు, ఎడమవైపునకు తిప్పితే కుడవైపునకు వెళ్లే సైకిల్‌ కూడా ఈయన వద్ద ఉంది. దీనిని తొక్కడం కొంత కష్టసాధ్యమంటున్నారు. 1957 నుంచి ఇప్పటి వరకూ వచ్చిన 27 రకాల ద్విచక్ర వాహనాలు సేకరించారు. ఇందులో పెద్దవి, బుల్లిబైక్‌లూ ఉన్నాయి. ఎలక్ట్రిక్‌ ఓవర్‌హెడ్‌ ట్రావెల్‌ వర్కింగ్‌ మోడల్‌ క్రేన్‌ను  విశాఖ మ్యూజియానికి ఉచితంగా ఇచ్చారు. ఇలాంటి కొన్ని నమూనాలు తయారు చేసి ఇంటిలోనే ఉంచారు. 

  -ఈనాడు, విశాఖపట్నం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని