logo

కదలని బస్సు... ప్రయాణికుల పాట్లు

ఆర్టీసీ బస్సులో సాంకేతిక లోపం తలెత్తి గోపాలపట్నం బీఆర్టీఎస్‌ రహదారిలో నిలిచిపోవడంతో గురువారం ట్రాఫిక్‌ స్తంభించింది. ఆ వివరాలు.. రామనవమి వేడుకల సందర్భంగా స్థానిక బీఆర్టీఎస్‌ రహదారిని ఆనుకుని ఉన్న సీతారామాలయంలో కల్యాణోత్సవానికి ఏర్పాట్లు చేశారు.

Published : 31 Mar 2023 04:23 IST

ఆగి పోయిన బస్సును తోస్తున్న ప్రయాణికులు, విద్యార్థులు

గోపాలపట్నం, న్యూస్‌టుడే : ఆర్టీసీ బస్సులో సాంకేతిక లోపం తలెత్తి గోపాలపట్నం బీఆర్టీఎస్‌ రహదారిలో నిలిచిపోవడంతో గురువారం ట్రాఫిక్‌ స్తంభించింది. ఆ వివరాలు.. రామనవమి వేడుకల సందర్భంగా స్థానిక బీఆర్టీఎస్‌ రహదారిని ఆనుకుని ఉన్న సీతారామాలయంలో కల్యాణోత్సవానికి ఏర్పాట్లు చేశారు. దీంతో వాహనాలను మధ్య మార్గంలోకి మళ్లించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి దేవరాపల్లి వెళ్తున్న 12డీ సిటీ సర్వీసు బస్సు ఆలయ సమీపంలోకి వచ్చేసరికి ఒక్కసారిగా మొరాయించింది. అప్పటికే భక్తుల ద్విచక్ర వాహనాలు, కార్లతో మార్గం మొత్తంగా ఇరుకుగా మారింది. ట్రాఫిక్‌ స్తంభించడంతో.. వాహనాలు బారులు తీరాయి. వెంటనే బస్సులో ప్రయాణికులు, రహదారిపై వెళ్లే వాహనచోదకులు స్పందించి..తలో చేయి వేసి బస్సుని ముందుకు నెట్టడంతో బస్సు కదలింది. ఇటీవల కాలంలో ఆర్టీసీ బస్సులు నగర రహదారుల్లో నిలిచిపోతున్నాయని, వాటికి పూర్తిస్థాయి మరమ్మతులు చేయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.

బీఆర్టీఎస్‌ రోడ్డులో స్తంభించిన వాహనాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని