logo

రెండో విడతలో 12,626 మందికి పోలింగ్‌ విధులు

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోలింగ్‌ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తయింది. సాధారణ పరిశీలకులు అమిత్‌ శర్మ, గాజువాక, విశాఖ పశ్చిమ, ఎస్‌.కోట నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు...

Updated : 01 May 2024 03:43 IST

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోలింగ్‌ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తయింది. సాధారణ పరిశీలకులు అమిత్‌ శర్మ, గాజువాక, విశాఖ పశ్చిమ, ఎస్‌.కోట నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు సీతారామ్‌ జూట్‌ సమక్షంలో కలెక్టర్‌ మల్లికార్జున మంగళవారం ఉదయం కలెక్టరేట్‌లో ఆన్‌లైన్‌లో ఈ ప్రక్రియ నిర్వహించారు.

  • విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పోలింగ్‌ కేంద్రాలకు పీఓలు, ఏపీఓలు, ఓపీవోలు మొత్తం 12,626 మందికి విధులు కేటాయించారు. సంబంధిత నమూనా ఆర్డరు కాపీలను పరిశీలకులు చూశారు.
  • జిల్లాలో 1991 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. వాటికి అదనంగా పది శాతం అంటే 2184 మంది పీఓలు, 2193 మంది ఏపీఓలను కేటాయించారు. పోలింగ్‌ కేంద్రంలో ఓటర్ల సంఖ్య 800 లోపు ఉంటే ముగ్గురు, 800 దాటితే నలుగురు ఓపీఓలను కేటాయించారు. 8249 మంది ఓపీఓలను అసెంబ్లీ నియోజకవర్గాల వారీ సర్దుబాటు చేశారు. భీమిలి 359, తూర్పు 293, దక్షిణం 237, ఉత్తరం 275, పశ్చిమం 222, గాజువాక 306, పెందుర్తి 299 చొప్పున పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టుగా పీఓలు, ఏపీఓలు, ఓపీఓలను కేటాయించారు. వీరికి ఈనెల 5,6 తేదీల్లో శిక్షణ ఉంటుందని కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో జేసీ కె.మయూర్‌ అశోక్‌, డీఆర్వో కె.మోహన్‌కుమార్‌, ఎన్‌ఐసీ అధికారులు చంద్రశేఖర్‌, హమీద్‌ పాషా, తదితరులు పాల్గొన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని