logo

రావికమతంలో జూనియర్‌ కళాశాల ఏర్పాటుకు కృషి

తెదేపా, భాజపా, జనసేన కూటమి అధికారంలోకి రాగానే రావికమతంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేసి, పీహెచ్‌సీని 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ హామీ ఇచ్చారు.

Published : 09 May 2024 03:55 IST

రావికమతం, న్యూస్‌టుడే: తెదేపా, భాజపా, జనసేన కూటమి అధికారంలోకి రాగానే రావికమతంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేసి, పీహెచ్‌సీని 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి రావికమతం, టి.అర్జాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థి కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, తెదేపా జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, జనసేన ఇన్‌ఛార్జి పీవీఎస్‌ఎన్‌ రాజుతో కలిసి రోడ్‌షో నిర్వహించారు. లిఖిత అనే యువతి ‘తాను ఎమ్మెస్సీ జువాలజీ చదివా. ఉద్యోగం రాలేదు. ఉపాధి హామీ పనులకు వెళ్తున్నా’నని చెప్పగా.. రెజ్యుమె పంపితే వారం రోజుల్లో ఉద్యోగం వేయిస్తానని సీఎం రమేశ్‌ ఆమెకు హామీ ఇచ్చారు. రాజాన కొండనాయుడు తదితరులు పాల్గొన్నారు.


కూటమికి మద్దతుగా బుల్లితెర నటుడి ప్రచారం

నక్కపల్లి, ఎస్‌. రాయవరం, న్యూస్‌టుడే: ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని బుల్లితెర నటుడు నిరుపమ్‌ (కార్తికదీపం సీరియల్‌) కోరారు. నక్కపల్లి, ఎస్‌.రాయవరం మండలం సోముదేవుపల్లిలో బుధవారం రాత్రి ఎమ్మెల్యే అభ్యర్థిని అనిత, ఎంపీ అభ్యర్థి రమేష్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. కూటమి అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలు, కల్పించే ఉద్యోగాలను వివరించారు. కొప్పిశెట్టి వెంకటేష్‌, హేమలత, మీసాల బాబులు, అడ్డూరి లోవరాజు, కె.వి.సత్యనారాయణ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని