logo

మున్సిపల్‌ ఉన్నతాధికారిపై ఈడీ కేసు నమోదు

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో విధులు నిర్వహించిన ఉన్నతాధికారి, ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) (హైదరాబాద్‌) ఒక ప్రకటనలో తెలిపింది.

Published : 10 May 2024 04:11 IST

విశాఖ లీగల్‌, న్యూస్‌టుడే: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో విధులు నిర్వహించిన ఉన్నతాధికారి, ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) (హైదరాబాద్‌) ఒక ప్రకటనలో తెలిపింది. రాజమహేంద్రవరం మున్సిపల్‌ పరిపాలన విభాగంలో రీజనల్‌ డైరెక్టర్‌గా పనిచేసిన వి.రాజేంద్రప్రసాద్‌ 1990-2015 మధ్యకాలంలో రూ.2.22 కోట్ల మేర ఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉన్నారని ఈడీ ఆరోపించింది. ఈ మేరకు విశాఖలోని ప్రత్యేక న్యాయస్థానంలో ఆయనతోపాటు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని