logo

జులై @ 100శాతం!

నవరత్నాల్లో భాగంగా పేదలకు మంజూరు చేసిన ఇళ్లను జులై ఆఖరు నాటికి వంద శాతం పూర్తి చేయాలని ఏఈ, డీఈలకు లక్ష్యాలను విధించారు. తొలుత పునాది స్థాయి దాటిన 27,000 ఇళ్లను మార్చి 31 నాటికి పూర్తి చేస్తారు. పునాదులు తవ్విన 69,000 ఇళ్లలో దశలవారీగా ని

Published : 18 Jan 2022 05:35 IST

గృహ నిర్మాణాల పూర్తికి అధికారులకు లక్ష్యాలు
లే అవుట్లలోనే ఇసుక డిపో, సిమెంట్‌ గోదాములు


పిల్లరు స్థాయిలో ఇంటి నిర్మాణం

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: నవరత్నాల్లో భాగంగా పేదలకు మంజూరు చేసిన ఇళ్లను జులై ఆఖరు నాటికి వంద శాతం పూర్తి చేయాలని ఏఈ, డీఈలకు లక్ష్యాలను విధించారు. తొలుత పునాది స్థాయి దాటిన 27,000 ఇళ్లను మార్చి 31 నాటికి పూర్తి చేస్తారు. పునాదులు తవ్విన 69,000 ఇళ్లలో దశలవారీగా నిర్మాణాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటారు. ఈ నెలాఖరు నాటికి 20 శాతం, మార్చికి 30, జూన్‌కు 50, జులైకి వంద శాతం చేసేలా కార్యాచరణ రూపొందించారు. 

అన్నీ లేఅవుట్లలోనే: జిల్లాలో 907 లేఅవుట్లు వేశారు. ఇక్కడే ఇసుక డిపోలు, సిమెంట్‌ గోదాములు ఏర్పాటు చేస్తారు. ప్రసుత్తం మూడు డిపోలు ఇసుకకు ఉండగా...చీపురుపల్లిలో  కొత్తగా మరొకటి ఏర్పాటు చేస్తున్నారు. వంద దాటి ఇళ్లున్న 70 లేఅవుట్లలో ఇలా ఇసుక డిపోలు వెలుస్తాయి. జిల్లాలో బొబ్బిలి, గుంకలాం, నెల్లిమర్ల, పార్వతీపురం, చీపురుపల్లి లేఅవుట్లలో సిమెంట్‌ గోదాముల్ని నిర్మిస్తున్నారు. ఒక్కో గోదాముకి రూ.7 లక్షలు కేటాయించారు. ప్రస్తుతం గుంకలాంలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.

* ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పనుల ప్రగతి తెలుసుకొనేందుకు వివరాలు నమోదు చేస్తారు. ప్రతి లేఅవుట్‌కు ఎంపీడీవో స్థాయి అధికారిని నియమించారు. క్లస్టర్, గ్రామ స్థాయిల్లో కూడా అధికారులు పర్యవేక్షిస్తారు. బీ లబ్ధిదారుడికి రూ.35వేలు డ్వాక్రా లేదా బ్యాంకు రుణ సదుపాయం మూడు శాతం వడ్డీకీ ఇళ్ల నిర్మాణానికి ఇస్తారు. మూడువేల మందికి ఇలా అందజేశారు.
* బిల్లుల చెల్లింపుల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకోనున్నారు. జిల్లాలో రూ.120 కోట్ల బిల్లులకు గానూ ఇప్పటికే రూ.100 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమయ్యాయి.

  సమస్యల పరిష్కారానికి చర్యలు
ఇసుక, ఇనుము, సిమెంట్‌కు కొరత లేదు. సోమవారమే మక్కువ, సాలూరుకు ఇనుము పంపించాం. ఇండెంట్‌ మేరకు సరఫరా చేస్తున్నాం. లబ్ధిదారులకు సమస్యలు లేకుండా టోల్‌ఫ్రీ నంబరు 7093930298ను అందుబాటులోకి తెచ్చాం. ఇబ్బందుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం.
- పి.కూర్మినాయుడు, పీడీ, గృహనిర్మాణశాఖ. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని