logo

ఎన్నికల ఫిర్యాదుల కోసం సంప్రదించండి

ఎన్నికల ఫిర్యాదుల కోసం 08922-797120, 08922- 797124 నెంబర్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి తెలిపారు.

Published : 26 Apr 2024 18:18 IST

విజయనగరం గ్రామీణం: ఎన్నికల ఫిర్యాదుల కోసం 08922-797120, 08922- 797124 నెంబర్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి తెలిపారు. ఈ నెంబర్లకు  ఫోన్  చేసి మోడల్ కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదులు చేయవచ్చని, ఎన్నికల సమాచారాన్ని పొందవచ్చన్నారు. అదే విధంగా ఎన్నికల ఫిర్యాదులను ప్రజా యాప్ సీ విజిల్ ద్వారా కూడా స్వీకరిస్తున్నామని తెలిపారు. ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లో క్షేత్ర స్థాయిలో విచారించి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం జరిగుతుందన్నారు. 1950 టోల్ ఫ్రీ నెంబర్ ఫిర్యాదుల కోసం 24/7 పని చేస్తోందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు