logo

వీరి ఆలోచన అద్భుతం

జిల్లాకు చెందిన విద్యార్థినులు రూపొందించిన ఓ ప్రాజెక్టుకు జాతీయస్థాయిలో ఉత్తమ గుర్తింపు లభించింది. ఈ నెల 14న ఫలితాలు వెల్లడయ్యాయి. అంతర్జాతీయ అంతరిక్ష వారోత్సవాలను పురస్కరించుకుని గతేడాది అక్టోబరు 4 నుంచి 10 వరకు అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌, ఇస్రో, సీబీఎస్‌ఈ

Published : 22 Jan 2022 05:45 IST

జాతీయ స్థాయిలోజిల్లా విద్యార్థినుల ప్రతిభ


తయారు చేసిన త్రీడీ ప్రజ్ఞారోవర్‌ ప్రాజెక్టు

మయూరికూడలి, న్యూస్‌టుడే: జిల్లాకు చెందిన విద్యార్థినులు రూపొందించిన ఓ ప్రాజెక్టుకు జాతీయస్థాయిలో ఉత్తమ గుర్తింపు లభించింది. ఈ నెల 14న ఫలితాలు వెల్లడయ్యాయి. అంతర్జాతీయ అంతరిక్ష వారోత్సవాలను పురస్కరించుకుని గతేడాది అక్టోబరు 4 నుంచి 10 వరకు అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌, ఇస్రో, సీబీఎస్‌ఈ సంయుక్తంగా ఏటీఎల్‌ స్పేస్‌ ఛాలెంజ్‌ పేరిట జాతీయస్థాయి పోటీలు నిర్వహించాయి. ఇందులో దేశంలోని 6,500 మంది విద్యార్థులు తయారు చేసిన 2,500 ప్రాజెక్టులను ప్రదర్శించారు. వాటిలో 75 అత్యుత్తమంగా నిలవగా రాష్ట్రం నుంచి విశాఖ, కడప, విజయనగరం జిల్లాలకు చెందిన ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. నెల్లిమర్ల బాలయోగి గురుకులం పాఠశాలకు చెందిన సైన్సు ఉపాధ్యాయురాలు ఐ.సీతమ్మ ఆధ్వర్యంలో 9వ తరగతి చదువుతున్న జి.లావణ్య, ఆర్‌.పూజిత, కె.చిన్నమ్మి తయారు చేసిన త్రీడీ ప్రజ్ఞా రోవర్‌ ఉత్తమ ప్రాజెక్టుగా ఎంపికైంది.

ఉపయోగం ఇలా.. అంతరిక్షంలో ఎదురవుతున్న సవాళ్లు, వాటి పరిష్కార మార్గాలను ఇది తెలియజేస్తుందని గైడ్‌ ఉపాధ్యాయురాలు సీతమ్మ తెలిపారు. చంద్రయాన్‌-2కు సంబంధించిన సాంకేతిక భాగంగా 3-డి ప్రజ్ఞా రోవర్‌ పాజెక్టును తయారు చేసినట్లు వివరించారు. దీని తయారీ విషయంలో తన కంటే విద్యార్థులే ఎక్కువ శ్రద్ధపెట్టి, అంతరిక్షానికి సంబంధించి అనేక విషయాలను ఆవళింపు చేసుకుని రూపొందించారని పేర్కొన్నారు. జిల్లా ప్రాజెక్టుకు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కడం ఆనందంగా ఉందని, మున్ముందు మరిన్నింటిని తయారు చేయించేందుకు కృషి చేస్తున్నామని గురుకులాల జిల్లా సమన్వయాధికారిణి బలగ చంద్రావతి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని