logo

మళ్లీ గ్యాస్‌ భారం

వంట గ్యాస్‌ వినియోగదారులపై మరోసారి భారం పడింది. ఈ నెల మొదటి వారంలో సిలిండర్‌పై చమురు సంస్థలు రూ.50 పెంచిన విషయం తెలిసిందే. శుక్రవారం  రూ.3.50 పెరగడంతో సిలిండర్‌ రూ.1010.50 అయ్యింది. జి

Published : 21 May 2022 04:27 IST

కలెక్టరేట్, న్యూస్‌టుడే: వంట గ్యాస్‌ వినియోగదారులపై మరోసారి భారం పడింది. ఈ నెల మొదటి వారంలో సిలిండర్‌పై చమురు సంస్థలు రూ.50 పెంచిన విషయం తెలిసిందే. శుక్రవారం  రూ.3.50 పెరగడంతో సిలిండర్‌ రూ.1010.50 అయ్యింది. జిల్లాలోని వివిధ గ్యాస్‌ ఏజెన్సీల పరిధిలో సుమారు 4.72 లక్షల సిలిండర్లు వినియోగంలో ఉండగా.. రాయితీవి దాదాపుగా నెలకు 1,50,000 నుంచి 1,80,000 వరకు ఉన్నాయి. ఎప్పటికప్పుడు  ధర పెరగడం...పేదల రాయితీ తగ్గిపోవడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. రాయితీ కనీసం రూ.3 కూడా రావడం లేదని వాపోతున్నారు. దీంతో మొత్తం ధర వెచ్చించే సిలిండరును తీసుకోవాల్సి వస్తోందని చెబుతున్నారు. మరోవైపు వాణిజ్య అవసరాలకు వినియోగించే దానిపైనా రూ.7 పెరిగింది. జిల్లా కేంద్రంలో దీనిధర రూ.2,401.50 అయ్యింది. బండ తీసుకొచ్చే డెలివరీ బాయ్‌లు రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. వాస్తవానికి ఏజెన్సీ నుంచి ఐదు కి.మీ.లోపు ఉచితంగా సరఫరా చేయాలి. 15 కి.మీ. దూరంలోపు ఉంటే రూ.20 తీసుకోవాలి. దాటితే రూ.30 చొప్పున వసూలు చేయాలన్న నిబంధనలు ఉన్నాయి. ఇవేవీ అమలు కావడం లేదని వినియోగదారులు వాపోతున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని