logo

భలే బండి.. తొక్కేయండి

గుర్ల మండలం గోషాడ గ్రామానికి చెందిన భావి ఇంజినీరు బోగురోతు బెనర్జీ తన ఆలోచనలకు పదును పెట్టి కొత్త బ్యాటరీ బైక్‌ను రూపొందించాడు. దీనికి ఒక్కసారి  ఛార్జి చేస్తే 200 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని చెబుతున్నాడు.

Updated : 01 Aug 2022 04:10 IST


బెనర్జీ తయారు చేసిన వాహనం…

గుర్ల మండలం గోషాడ గ్రామానికి చెందిన భావి ఇంజినీరు బోగురోతు బెనర్జీ తన ఆలోచనలకు పదును పెట్టి కొత్త బ్యాటరీ బైక్‌ను రూపొందించాడు. దీనికి ఒక్కసారి  ఛార్జి చేస్తే 200 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని చెబుతున్నాడు. విజయనగరంలోని సీతం కళాశాలలో బీటెక్‌ ఆఖరి సంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థి ఇంధనంతో నడిచే పాత ద్విచక్రవాహనం నుంచి కొన్ని విడిభాగాలను తీసుకొని వాటికి రెండు బ్యాటరీలను అమర్చాడు. ఇందుకు రూ.20 వేలు ఖర్చు చేసినట్లు బెనర్జీ తెలిపాడు. ఇందులో రెండు మోటార్లు ఉంటాయని, ఒకటి పనిచేయకపోతే రెండోది వెంటనే పనిచేస్తుందని చెబుతున్నాడు. ఇందులో వెనుక చక్రం చైనుతో, ముందు చక్రం హబ్‌తో నడుస్తుందన్నాడు. ప్రస్తుతం మార్కెట్‌లోకి వచ్చిన ఎలక్ట్రికల్‌ బైకుల కన్నా ఇది ఎంతో మెరుగైనందని పేర్కొన్నాడు.

- న్యూస్‌టుడే, గుర్ల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని