logo

రౌడీయిజం వైకాపా నైజం

‘వైకాపాది రౌడీయిజం.. వారి నైజమే అది.. అభివృద్ధిని కాంక్షించేది తెదేపానే.. ఈ ఐదేళ్లలో అధికార పార్టీ నేతలు ఉత్తరాంధ్రను దోచుకున్నారు.. వచ్చే ఎన్నికల్లో వారిని ఓడించాలి’ అని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు.

Published : 04 May 2024 02:59 IST

ఎన్నికల్లో వారిని ఓడించాలి
కొత్తవలస సభలో బాలయ్య

‘వైకాపాది రౌడీయిజం.. వారి నైజమే అది.. అభివృద్ధిని కాంక్షించేది తెదేపానే.. ఈ ఐదేళ్లలో అధికార పార్టీ నేతలు ఉత్తరాంధ్రను దోచుకున్నారు.. వచ్చే ఎన్నికల్లో వారిని ఓడించాలి’ అని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా కొత్తవలస పట్టణంలో శుక్రవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

మోసాలు, మాయలు, కుట్రలు, కుతంత్రాలతో పాలన సాగించే జగన్‌లాంటి వ్యక్తిని గద్దె దించాలని పిలుపునిచ్చారు. కూటమి విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌, ఎస్‌.కోట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని కోళ్ల లలితకుమారి, గొంప కృష్ణ పాల్గొన్నారు.

న్యూస్‌టుడే, కొత్తవలస, ఎస్‌.కోట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని