logo

క్యాంపస్‌ ఛాలెంజ్‌లో విదేశీయుల సందడి

పూసపాటిరేగ మండలంలోని కోనాడ కూడలిలో ఉన్న క్యాంపస్‌ ఛాలెంజ్‌లో బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ గారేత్‌ విన్‌ ఒవెన్‌, యూకే యుద్ధనౌక క్రూ సభ్యులు శనివారం సందడి చేశారు.

Published : 02 Apr 2023 05:33 IST

విభిన్న ప్రతిభావంతులతో క్రికెట్ ఆడుతున్న బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ గారేత్‌ విన్‌ ఒవెన్‌

పూసపాటిరేగ, న్యూస్‌టుడే: పూసపాటిరేగ మండలంలోని కోనాడ కూడలిలో ఉన్న క్యాంపస్‌ ఛాలెంజ్‌లో బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ గారేత్‌ విన్‌ ఒవెన్‌, యూకే యుద్ధనౌక క్రూ సభ్యులు శనివారం సందడి చేశారు. హెచ్‌ఎంఎస్‌ తమర్‌ పి-233 యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు చెందిన యుద్ధనౌక విశాఖపట్నం పోర్టును సందర్శించింది. క్రూ సభ్యులతో పాటు బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ క్యాంపస్‌ ఛాలెంజ్‌ను సందర్శించారు. ముందుగా విభిన్న విద్యార్థులు పుష్పగుచ్ఛాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. దివ్యాంగులకు అందిస్తున్న విద్య, వైద్య సదుపాయాలను పరిశీలించారు. దివ్యాంగ విద్యార్థులతో కాసేపు గడిపారు. ఆటలు ఆడారు. పాఠశాలలోని  ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ పూర్వ విద్యార్థులు జి.ఆర్‌.సి.బోస్‌, డి.ఎస్‌.రాజు, కమాండర్‌ లక్ష్మణరావు, క్యాంపస్‌ ఛాలెంజ్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణశర్మ తదితరులు పాల్గొన్నారు.

క్యాంపస్‌ ఛాలెంజ్‌ ఆవరణలో మొక్కలు నాటుతున్న యూకే యుద్ధనౌక క్రూ సభ్యులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని