logo

ప్రశాంతంగా పోస్టల్‌ బ్యాలెట్‌

జిల్లా వ్యాప్తంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియ ఆదివారం ప్రశాంతంగా జరిగింది. విజయనగరం, గజపతినగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, బొబ్బిలి, రాజాం, ఎస్‌.కోట నియోజకవర్గ కేంద్రాల్లో ఫెసిలిటేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Published : 06 May 2024 03:40 IST

విజయనగరంలోని జేఎన్‌టీయూ కేంద్రంలో ఓటేసేందుకు వరుసకట్టిన ఉద్యోగులు

విజయనగరం ఉడాకాలనీ, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియ ఆదివారం ప్రశాంతంగా జరిగింది. విజయనగరం, గజపతినగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, బొబ్బిలి, రాజాం, ఎస్‌.కోట నియోజకవర్గ కేంద్రాల్లో ఫెసిలిటేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. విజయనగరంలోని జేఎన్‌టీయూ గురజాడ విశ్వవిద్యాలయంలో పెట్టిన రెండు ఫెసిలిటేషన్‌ కేంద్రాలను కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారిణి నాగలక్ష్మి సందర్శించారు. క్యూలైన్లు, పోలింగ్‌ బూత్‌లు, హెల్ప్‌ డెస్క్‌, ఓటింగ్‌ ప్రక్రియను పరిశీలించారు. కొంతమంది తమ ఓట్లు జాబితాలో లేవని చెప్పడంతో.. వారికి ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తామని చెప్పారు. నియామక పత్రాలు, గుర్తింపు కార్డులతో హక్కు పొందవచ్చన్నారు. జేసీ కార్తీక్‌, సహాయ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ జిల్లా నోడల్‌ అధికారి సందీప్‌కుమార్‌, డీఆర్‌డీఏ పీడీ కల్యాణ్‌ చక్రవర్తి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ సుధారాణి, జడ్పీ ఉప సీఈవో రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

తొలిరోజు 5,659 ఓట్లు

విజయనగరం ఉడాకాలనీ, న్యూస్‌టుడే: జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియలో ఆదివారం అన్ని నియోజకవర్గాలకు సంబంధించి 4,989 ఓట్లు పోలయ్యాయి. ఇతర జిల్లాలకు చెందిన 670 మంది ఓట్లు వేశారు. మొత్తంగా జిల్లాలో 5,659 ఓట్లు పోలయ్యాయి. అత్యధికంగా విజయనగరం నియోజకవర్గంలో పోలవగా, అత్యల్పంగా చీపురుపల్లి నియోజకవర్గంలో పోలింగ్‌ జరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు