logo

డోర్నకల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఖరారు

డోర్నకల్‌ కాంగ్రెస్‌ టికెట్‌పై నెలకొన్న ఉత్కంఠతకు తెర పడింది. పార్టీ అధిష్ఠానం సోమవారం రాత్రి 10.30 గంటలకు విడుదల చేసిన మూడో జాబితాలో డోర్నకల్‌ నుంచి డా.జాటోత్‌ రామచంద్రునాయక్‌ పేరును ఖరారు చేసింది.

Published : 07 Nov 2023 05:07 IST

న్యూస్‌టుడే, డోర్నకల్‌

పేరు: డా.జాటోత్‌ రామచంద్రునాయక్‌

స్వస్థలం: బొమ్మకల్‌ గ్రామం, పెద్దవంగర మండలం, మహబూబాబాద్‌ జిల్లా

వృత్తి: వైద్యుడు

ప్రస్తుత పదవి: డోర్నకల్‌ కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి * గత చరిత్ర: 2014లో తెదేపా తరఫున, 2018లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ఉత్కంఠకు తెర..!:  డోర్నకల్‌ కాంగ్రెస్‌ టికెట్‌పై నెలకొన్న ఉత్కంఠతకు తెర పడింది. పార్టీ అధిష్ఠానం సోమవారం రాత్రి 10.30 గంటలకు విడుదల చేసిన మూడో జాబితాలో డోర్నకల్‌ నుంచి డా.జాటోత్‌ రామచంద్రునాయక్‌ పేరును ఖరారు చేసింది. ఉమ్మడి జిల్లాలో 11 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌ ఒక్క డోర్నకల్‌ నియోజకవర్గాన్ని మాత్రం పెండింగ్‌లో ఉంచింది. టికెట్‌ కోసం తీవ్ర పోటీ నెలకొనడంతో నామినేషన్ల ఘట్టం ప్రారంభమై మూడు రోజులు గడిచాక అభ్యర్థిని ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. డాక్టర్‌ జాటోత్‌ రామచంద్రునాయక్‌ ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో 2014 శాసనసభ ఎన్నికలప్పుడు తెదేపాలో చేరిన ఆయనకు పార్టీ టికెట్‌ ఇచ్చింది. ఓటమి చెందాక పార్టీ వీడిన ఆయన 2018లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా తలపడి పరాజయం చెందారు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న డా.జాటోత్‌ రామచంద్రునాయక్‌కు కాంగ్రెస్‌ టికెట్‌ లభించడంతో ఆయన డోర్నకల్‌లో వరుసగా మూడోసారి ప్రస్తుత ఎమ్మెల్యే, భారాస అభ్యర్థి రెడ్యానాయక్‌తో పోటీ పడనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని