logo

పోలింగ్‌ శాతం పెంపునకు కృషి

లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌శాతం పెంచడానికి మెప్మా సిబ్బంది కృషి చేయాలని వరంగల్‌ జిల్లా స్వీప్‌ నోడల్‌ అధికారిణి భాగ్యలక్ష్మి పేర్కొన్నారు.

Published : 28 Apr 2024 01:49 IST

ప్రసంగిస్తున్న జిల్లా స్వీప్‌ నోడల్‌ అధికారిణి భాగ్యలక్ష్మి

ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌శాతం పెంచడానికి మెప్మా సిబ్బంది కృషి చేయాలని వరంగల్‌ జిల్లా స్వీప్‌ నోడల్‌ అధికారిణి భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో స్వీప్‌-2024 (సిస్టమేటిక్‌ ఓటర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎలక్టోరల్‌ పార్టిసిపేషన్‌) అవగాహన కార్యక్రమాల్లో భాగంగా వరంగల్‌ కాకతీయ వైద్య కళాశాల ఎన్‌ఆర్‌ఐ భవనంలో రిసోర్సుపర్సన్స్‌(ఆర్పీ)లకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.

మెప్మా ఆర్పీలతో ఎన్నికల ప్రతిజ్ఞ

 బల్దియా అదనపు కమిషనర్‌ రషీద్‌ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో ఆర్పీలు ఎన్నికల నియమావళి పాటించాలన్నారు. ఈ సందర్భంగా ఆర్పీలతో పాటు సమావేశంలో పాల్గొన్న అధికారులు, సిబ్బందితో ఎన్నికల ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎన్‌ఆర్‌ఐ భవనం నుంచి కాకతీయ మెడికల్‌ కాలేజీ ప్రధాన ద్వారం వరకు ఎన్నికల అవగాహన ర్యాలీ నిర్వహించారు. పీడబ్ల్యూడీ జిల్లా నోడల్‌ అధికారి సత్యవాణి, మెప్మా పీడీ భద్రునాయక్‌, వరంగల్‌ తూర్పు స్వీప్‌ నోడల్‌ అధికారి కోలా రాజేశ్‌కుమార్‌, డిప్యూటీ కమిషనర్‌ రవీందర్‌, వరంగల్‌, ఖిలావరంగల్‌ మండల తహసీల్దార్లు ఇక్బాల్‌, నాగేశ్వర్‌రావు, టీఎంసీ రమేశ్‌, మెప్మా సీఈఓలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని