logo

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు

జిల్లాలో విస్తృత తనిఖీలు చేపట్టి లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అధికారులను ఆదేశించారు.

Published : 28 Apr 2024 01:38 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా, చిత్రంలో జూనియర్‌ సివిల్‌ జడ్జి రామచంద్రరావు

భూపాలపల్లి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో విస్తృత తనిఖీలు చేపట్టి లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి రామచంద్రారావుతో కలిసి జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. వైద్యాధికారులకు లింగనిర్థారణ నిషేధిత చట్టాలపై అవగాహన కలిగేలా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని గైనకాలజిస్టు, రేడియాలజిస్టులను కలెక్టరు ఆదేశించారు. డీఎంహెచ్‌వో అనుమతి లేకుండా ఆసుపత్రుల్లో స్కానింగ్‌ యంత్రాల కొనుగోలు, వినియోగం చేయరాదన్నారు. జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి మాట్లాడుతూ జిల్లాస్థాయిలో ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నెంబర్‌ ప్రారంభించాలని, ప్రైవేటు ఆసుపత్రుల్లో లింగనిర్థారణ చేయరాదనే బోర్డులతోపాటు అనుమానాస్పద ఆసుపత్రులపై నిత్యం తనిఖీలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ మధుసూదన్‌, డీఎస్పీ సంపత్‌రావు, డీపీఆర్వో శ్రీనివాస్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ కొమురయ్య, ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ శ్రీదేవి, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ కె శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలి

భూపాలపల్లి కలెక్టరేట్‌: లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో పోలింగ్‌ కేంద్రాల్లో చేయాల్సిన ఏర్పాట్లపై రెవెన్యూ, పంచాయతీరాజ్‌, వైద్య, తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి అల్పాహారం, భోజనం, వసతి, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్తు తదితర అన్ని ఏర్పాట్లను ఎంపీడీవోలు చేయాలన్నారు. ప్రతి కేంద్రంలో ర్యాంపు, వీల్‌ ఛైర్‌, చల్లని తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, బాలింతలు, గర్భిణులు సత్వరం ఓటుహక్కు వినియోగించుకునేలా చూడాలన్నారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో అత్యవసర వైద్య సేవల కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు.  కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్‌ కలెక్టర్‌ ఉమాశంకర్‌ప్రసాద్‌, ఆర్టీవో మంగిలాల్‌, జడ్పీ సీఈవో విజయలక్ష్మి, డీఆర్డీవో నరేశ్‌, డీపీఆర్వో శ్రీనివాస్‌, డీపీవో నారాయణరావు, డీఎంహెచ్‌వో డాక్టర్‌ మధుసూదన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని